ఆ ఎయిర్‌పోర్టుల్లో కెమెరాతోనే సెక్యూరిటీ క్లియరెన్స్‌

4 Oct, 2018 11:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇక ఎయిర్‌పోర్ట్‌ల్లో సెక్యూరిటీ క్లియరెన్స్‌లకు భారీ ప్రక్రియకు తెరపడనుంది. విమానం ఎక్కేందుకు బోర్డింగ్‌ పాస్‌లు అవసరం లేకుండా కెమెరా వైపు చూడటం ద్వారా ముఖకవళికలను గుర్తించే ప్రక్రియను పలు విమానాశ్రయాలు త్వరలో చేపట్టనున్నాయి. ప్రయాణీకుల బోర్డింగ్‌ ప్రక్రియ కోసం విమనాశ్రయాలు ఆటోమేటెడ్‌ ఫేషియల్‌ రికగ్నేషన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నాయి. ప్రధాన మంత్రి డిజీ యాత్ర కార్యక్రమంలో భాగంగా పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూర్‌ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఈ ఆధునిక వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది.

కాగా వారణాసి, విజయవాడ, కోల్‌కతా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకుల బోర్డింగ్‌ ప్రక్రియలో బయోమెట్రిక్‌ యాక్సెస్‌ను ప్రవేశపెట్టాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించిన సంగతి తెలిసిందే.ముఖాలను గుర్తించే సాంకేతికతోయకూడిన ఆటోమేటెడ్‌ సెక్యూరిటీ స్కానర్లను ఎయిర్‌పోర్టుల ప్రవేశ, సెక్యూరిటీ, బోర్డింగ్‌ పాయింట్స్‌లో ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రయాణీకుల ముఖాలను కెమెరా స్కాన్‌ చేసి, ఆయా వివరాలను వెరిఫై చేస్తూ సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఇస్తుందని, క్లియరెన్స్‌ కోసం సెక్యూరిటీ గేట్‌ వద్ద ప్రయాణీకులు పడిగాపులు కాసే అవసరం ఉండదని పేర్కొన్నారు.మరోవైపు మూడు ఎయిర్‌పోర్టుల్లో పైటల్‌ పద్ధతిన బయోమెట్రిక​ బోర్డింగ్‌ ప్రక్రియను ప్రవేశపెడుతున్నట్టు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు