కుటుంబ సభ్యుల సహకారంతో రేప్ చేశాడు

23 Mar, 2016 15:34 IST|Sakshi
కుటుంబ సభ్యుల సహకారంతో రేప్ చేశాడు

ముజఫర్నగర్: ఓ కామాంధుడు అమ్మాయిని అత్యాచారం చేయడానికి అతని కుటుంబ సభ్యులు సహకరించారు. నిందితుడి సోదరి బాధితురాలిని ఇంటికి తీసుకురాగా, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే దారుణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని పుర్కాజీ పట్టణంలో ఈ ఘటన జరిగినట్టు బుధవారం పోలీసులు చెప్పారు.

బాధితురాలి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు.. ఇటీవల ఆమె (17)ను నదీమ్ (25) అనే యువకుడి సోదరి అఫ్సానా వారి ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో ఆఫ్సానా ఇంట్లో నదీమ్, తల్లిదండ్రులు శార్వరి, ఇక్రామ్, బంధువు కమిల్ ఉన్నారు. వీరందరూ ఉండగానే నదీమ్ బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ముజఫర్నగర్ ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడు నదీమ్తో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నదీమ్ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే జరిగిన మరో ఘటనలో జాహిద్ (30) అనే వ్యక్తి.. ఓ మహిళను ఆమె ఇంట్లోనే అత్యాచారం చేశాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు