ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయండి

12 Jun, 2014 14:10 IST|Sakshi
ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయండి

న్యూఢిల్లీ : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం స్పీకర్ సుమిత్రా మహాజన్కు ఫిర్యాదు చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ తరపున గెలుపొంది టీడీపీలో చేరిన ఎస్పీవై రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ ఎంపీలు...స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ టీడీపీలో చేరినట్లు ఎస్పీవై రెడ్డి తనకు తానుగానే ప్రకటించుకున్నారని గుర్తు చేశారు.

అనర్హత వేటు వేస్తే టీడీపీ తరపున పోటీ చేస్తానని ఆయనే చెప్పారని, నిబంధనల ప్రకారం ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరినట్లు చెప్పారు. ఈ అంశంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కోరినట్లు చెప్పారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను స్పీకర్‌కు సమర్పించామన్న ఎంపీ మేకపాటి...నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని స్పీకర్‌ చెప్పినట్లు వెల్లడించారు. కాగా వైఎస్సార్సీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవెరైడ్డి  విజయం సాధించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమై చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు