రాజ్‌నాథ్ సింగ్‌తో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల భేటీ

7 Feb, 2018 10:26 IST|Sakshi
రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

న్యూ ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం హామీలు అమలు చేయాలని కేంద్ర హోం మంత్రిని కోరారు. ఈ భేటీలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు ఆందోళన ఉపసంహరించుకున్నా, పట్టువీడకుండా వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ఏపీ ప్రజల కష్టాలను రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించామని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం, దుగ్గరాజపట్నం, కడప స్టీల్‌ ప్లాంట్ వంటి అంశాలను రాజ్‌నాథ్‌ సింగ్‌ దృష్టికి తీసుకువచ్చామన్నారు. టీడీపీ అధికారంలో ఉండి డ్రామాలాడుతోందని పేర్కొన్నారు. తమ డిమాండ్లపై రాజ్‌నాథ్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. హామీల అమలుపై టీడీపీ కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదన్నారు.  బడ్జెట్‌ సమావేశాల్లోపు విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు