కశ్మీర్‌లో విధ్వంసానికి పాక్‌ కుట్ర

1 Nov, 2017 11:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో భారీ విధ్వంసానికి ఆల్‌ఖైదా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థలు కుట్రలు చేస్తున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆల్‌ఖైదా కమాండర్‌ జాకీర్‌ ముసా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులతో కలిసి లోయలో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని అంతర్గత నిఘా సంస్థలు తెలిపాయి. జాకీర్‌ముసా, మరికొందరు హిజ్బుల్‌ ఉగ్రవాదులు కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

జాకీర్‌ ముసా, మరో ఇద్దరు ఉగ్రవాదులు అక్టోబర్‌ 26న పుల్వామాలోని ఒక రహస్య ప్రాంతంలో సమావేశమయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక విధ్వంసం కోసం కొత్తగా శిక్షణ తీసుకున్న 12 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్‌ నియంత్రణ రేఖ గుండా భారత్‌లోకి ప్రవేశపెట్టిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.  మొత్తం 14 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా దాక్కున్నారని.. వీరు ఎప్పుడైనా విధ్వంసం సృష్టించే ప్రమాదముందని నిఘావర్గాలు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు