అమ్మ తోడు.. డబ్బులు వస్తాయి!

15 Feb, 2019 12:01 IST|Sakshi

ప్రతీచోటా ఆన్‌లైన్‌ వినియోగం పెరిగింది. అది ఎంతలా అంటే.. ఆకలేస్తే వండుకోవడం మానేసి.. ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేసేంతంలా ఆన్‌లైన్‌ అలవాటైపోయింది. జోమాటో, స్విగ్గీ, ఫుడ్‌ పాండాలాంటి ఎన్నో యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫుడ్‌ ఆర్డర్‌చేస్తే.. క్షణాల్లో మన ముందుకు వచ్చేస్తుంది. అయితే అప్పుడప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసేప్పుడు సాంకేతిక సమస్యల దృష్ట్యా మన డబ్బు కట్‌ అవుతుంది కానీ ఫుడ్‌ డెలివరీ కాదు. అయితే మళ్లీ ఐదారు రోజుల తరువాత మన డబ్బు మనకు రిటర్న్‌ వస్తుంది. ఇలాంటి సమస్య చాలా మందికి ఎదురై ఉంటుంది. 

అయితే ఓ కస్టమర్‌కు ఈ విధంగానే జరిగింది. ప్రస్తుతం ఆ కస్టమర్‌కు, జొమాటోకు మధ్య జరిగిన సంభాషణ బాగా వైరల్‌ అవుతోంది. ఆ కష్టమర్‌ ఫుడ్‌ను ఆర్డర్‌ చేయగా.. మరోసారి తన ఫుడ్‌ను ఆర్డర్‌ చేయాలని జొమాటో కోరింది. అయితే ఇంతకు ముందు కట్‌ అయిన్‌ డబ్బులు ఏమయ్యాయని కస్టమర్‌ అడిగాడు. ఆ డబ్బులు నాలుగైదు రోజుల్లో రిటర్న్‌ అవుతాయని సదరు కస్టమర్‌కు తెలిపింది. అయితే నమ్మకం కలగని కస్టమర్‌.. అమ్మతోడు వేసి చెప్పండి కచ్చితంగా డబ్బులు వస్తాయి కదా? అని అడిగాడు. ‘అమ్మతోడు కచ్చితంగా డబ్బులు వస్తాయ’ని జొమాటో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫన్నీ కన్వర్జేషన్‌ నవ్వు తెప్పింస్తోందని కొందరు, జొమాటో ప్రామిస్‌ డేను ఫాలో అవుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు