కల్యాణ‘లబ్ధి’ ఒక్కసారే...! 

27 Jun, 2019 04:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఒక్కసారే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో మొదటి పెళ్లి, రెండో పెళ్లి అనే అంశాలు అప్రస్తుతమని తేల్చి చెప్పింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన సోదరి రెండో వివా హం నేపథ్యంలో కల్యాణలక్ష్మి లబ్ధి పొందవచ్చా అని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం లోతుగా పరిశీలించి ఈ ఆదేశాలు జారీ చేసింది. 

>
మరిన్ని వార్తలు