హైజాక్ అయిన భారతీయ సిబ్బంది క్షేమం

22 Jul, 2013 16:36 IST|Sakshi

సముద్రపు దొంగలు హైజాక్ చేశారని భావిస్తున్న తుర్కిష్ నౌక ఎం.వి.కాటన్ అందులోని 20 మంది భారతీయ సిబ్బంది క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ సోమవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఆ నౌక భారతీయ సిబ్బందితో క్షేమంగా తిరిగి వస్తుందని ఆయన తెలిపారు.

 

గత ఆదివారం పశ్చిమ ఆఫ్రికాలోని గేబన్లో జంటిల్ నౌకాశ్రయం సమీపంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న తుర్కిష్ నౌకను గత ఆదివారం సముద్రపు దొంగలు ఆటాకాయించి హైజాక్ చేశారని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. నౌక సిబ్బందికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని  నౌక యాజమాన్యం వెల్లడించిందని మీడియా పేర్కొంది. దీంతో నౌక హైజాక్కు గురైందని భావిస్తున్నట్లు యాజమాన్యం ఆందోళన చెందింది.

 

అదికాక పశ్చిమాఫ్రికాలో సముద్రపు దొంగలు ఓడలను హైజాక్ చేస్తున్న సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని యాజమాన్యం ఈ సందర్భంగా గుర్తు చేసింది. అయితే ఈ ఘటనపై గేబన్లోని తర్కిష్ రాయబారీ పశ్చిమ ఆఫ్రికా ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నారని మీడియా గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు