గల్ఫ్‌లో 28,523 మంది భారతీయులు మృతి

14 Dec, 2018 17:20 IST|Sakshi

లోక్‌సభలో ప్రకటించిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి

గల్ఫ్‌ డెస్క్‌: గడిచిన ఐదేళ్లలో గల్ఫ్‌ దేశాల్లో మృతిచెందిన భారతీయుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్‌ దేశాల్లో 28,523 మంది భారతీయులు మరణించినట్లు బుధవారం లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు. ఆత్మహత్యలు, అనారోగ్యం, వివిధ ప్రమాదాల వల్ల వలస కార్మికులు మృతి చెందినట్లు మంత్రి వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్‌లో మరణించిన భారతీయుల సంఖ్యను సంవత్సరాల వారీగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు