కాలిఫోర్నియా: బే ఏరియాలో వైఎస్సార్‌సీపీ విజయోత్సవ వేడుకలు

24 Jul, 2019 13:51 IST|Sakshi

కాలిఫోర్నియా : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అమెరికా కాలిఫోర్నియాలోని ‘బే’ ప్రాంతంలో ఆ పార్టీ యూఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు జూలై 7, ఆదివారం రోజున విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలను కూడా కలిపి సంయుక్తంగా ఏర్పాటు చేశారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంటు సీట్లు గెలుచుకోవడంతో ఎన్‌ఆర్‌ఐ విభాగం విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. మిల్పిటాస్‌లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, సినీనటుడు, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రతినిధి పృద్వీరాజ్‌, డాక్టర్‌ హనిమిరెడ్డి లక్కిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎన్‌ఆర్‌ఐ విభాగం సత్కరించింది.

కాలిఫోర్నియా ప్రముఖులు డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్సార్‌ పాలనను మరిపించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందించాలన్నారు.. 35 రోజుల జగన్‌ పాలనపై సానుకూలంగా స్పందించారు. తర్వాత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆనాడు వైఎస్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే, తాజాగా జరిగిన ఎన్నికల్లో తనకు విజయం సాధ్యమైందన్నారు. తన నియోజకవర్గంలో జగన్‌తో కలసి నడిచిన పాదయాత్ర అనుభవాలను  పంచుకున్నారు. మైలవరం నియోజక వర్గంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్‌ఆర్‌ఐలను స్వాగతించారు. ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేసిన ఎన్‌ఆర్‌ఐలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సినీనటుడు పృథ్వీ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తారని, ఏపీ అభివృద్ధి విషయంలోఆయన ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమానికి బే ప్రాంతంలో నివసించే వైఎస్ఆర్‌ అభిమానులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాదాపు 350 మందికి పైగా హాజరయ్యారు. కార్యక్రమ ఏర్పాట్లను ఉమా కొండూరు, రామారావు, అబ్దుల్, రామకృష్ణారెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, వీర సురవరం, హనిమి మేరవ, రాజేందర్‌ చావా, రామనాధ్, వెంకట్ పులుసు, శంకర్‌, హరి అర్రనగు, పార్వతి, లక్ష్మీ,  అంజిరెడ్డి కుడుమల్, సీతారెడ్డి గోగులముడి, శంకర్, నరేష్ కొండూరు, సురేష్ తనమాలా, అమర్‌నాధ్, హరీందర్‌ శీలం, సురేందర్ పులగం, ప్రవీణ దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో డా. రాఘవ, నరేందర్‌ కొత్తకోట, కరుణాకర్‌, లక్ష్మారెడ్డి మొర్తాల, శ్రీనివాస రెడ్డి అవుతు, రాజేందర్‌, వరప్రసాద్‌, ప్రవీణ్‌, సుగుణ, బంకా విజయభాస్కర్‌ రెడ్డి, తిరుపతి రెడ్డి, సుబ్బారెడ్డి అంకిరెడ్డి, జగదీష్‌, అనిల్‌, గాంధీ, లక్ష్మణ్‌, శ్రీనివాసులు పబ్బులేటి, ధర్మరాజు, సురేంద్ర, బిందు, ఝాన్సీ, ప్రభాకర్‌ చాగంటి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు