చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లియో అరెస్ట్

15 Jul, 2013 16:01 IST|Sakshi
అమెరికాలో చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఫాదర్ లియో కొప్పలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అమెరికాలో చిన్నారి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఫాదర్ లియో కొప్పల(47) పై కేసు నమోదు చేసినట్లు యూఎస్ పోలీసులు సోమవారం వెల్లడించారు. అనంతరం తాము చేపట్టిన విచారణలో అతడు నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అతడిపై సెకండ్ డిగ్రీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో లియోకు 25 ఏళ్ల జైలు శిక్ష లేదా 35 వేల అమెరికన్ డాలర్ల జరిమాన విధించవచ్చని పోలీసులు తెలిపారు. లేకుంటే ఆ రెండు శిక్షలు విధించే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డయోసిస్కు చెందిన ఫాదర్ లియో మిన్నీసొటా రాష్ట్రంలోని బ్లూఎర్త్లో పాల్ క్యాథలిక్, సెయింట్స్ పీటర్ చర్చిలో గత నాలుగేళ్లగా విధులు నిర్వర్తిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. కాగా బ్లూఎర్త్లోని ఓ వృద్ధ మహిళ చిన్నారితో కలసి నివసిస్తుంది. ఈ నెల 7న లియోను ఆ వృద్ధ మహిళ భోజనానికి ఆహ్వానించింది. అయితే లియోకు భోజనం పెట్టి ఆ మహిళ పనిపై బయటకు వెళ్లింది. అతడు భోజనం చేశాడు.

 

అనంతరం ఆ ఇంటిలోని చిన్నారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ చిన్నారిని భయం అవరించింది. దాంతో విషయాన్ని ఆ చిన్నారి వెంటనే వృద్ధ మహిళకు తెలిపింది. ఆ మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. అనాధ, నిరుపేద చిన్నారులు, నెల్లూరు, ప్రకాశం జిలాల్లో అనాధాశ్రమాల్లోని చిన్నారుల విద్య కోసం వివిధ కార్యక్రమాల ద్వారా లియో కొప్పల విరాళాలను సేకరిస్తుంటాడు.

మరిన్ని వార్తలు