భారతీయ డ్రైవర్‌ను చితకబాదిన యూఏఈ అధికారి

19 Jul, 2013 16:59 IST|Sakshi
ఓ భారతీయ డ్రైవర్‌ను యూఏఈకి చెందిన ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి చితక్కొడుతున్న దృశ్యమిదీ.

ఓ భారతీయ డ్రైవర్‌ను యూఏఈకి చెందిన ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి చితక్కొడుతున్న దృశ్యమిదీ. ఇతడు నడుపుతున్న వ్యాన్ అనుకోకుండా యూఏఈ అధికారికి చెందిన వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదశాత్తూ జరిగిందని చెప్పినా వినుకోకుండా ఈ అధికారి కొట్టడం ప్రారంభించాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ దాడి ఘటనను ఆ సమయంలో అక్కడే ఉన్న భారత్‌కు చెందిన ఓ యువకుడు(22) వీడియో తీశాడు. సోమవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.

 

అయితే, అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా.. అన్‌లైన్‌లో పెట్టడం ద్వారా తమను అప్రతిష్టపాలు చేశాడంటూ సదరు అధికారి బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు భారతీయ యువకుడిని అరెస్టు చేశారు. యూట్యూబ్‌లో వీడియో చూసిన పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అటు సదరు అధికారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

 

అధికారిపై దాడి కేసు నమోదు చేశారు. అధికారి చేసిన నేరం రుజువైనా.. అతడికి ఏడాది జైలు శిక్షతోపాటు 10 వేల దినార్ల జరిమానా మాత్రమే పడుతుంది. అదే.. అనుమతి లేకుండా వీడియో చిత్రీకరణ, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే కేసులో భారతీయ యువకుడి పాత్ర రుజువైతే.. రెండేళ్ల జైలు, 20 వేల దినార్ల జరిమానా పడుతుందట!

మరిన్ని వార్తలు