అభివృద్ధితో తిరుగుబాట్లను అణచవచ్చు

29 Jun, 2013 16:29 IST|Sakshi

అభివృద్ధితోనే తిరుగుబాట్లను అణచవచ్చని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ అభిప్రాయపడ్డారు. యూకేలోని ఇండియా హౌస్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.  ప్రపంచంలో ఎక్కడైన అభివృద్ధి అనేది ఒక సారి మొదలైతే తిరుగుబాట్లు వాటికవే తొకముడుచుకుంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకు అసోం రాష్ట్రం అత్యుత్తమ ఉదాహారణ అని ఆయన చెప్పారు. ఒకనాటి అసోం రాష్ట్రం తిరుగుబాట్లకు నిలయమై నిత్యం రావణ కాష్ఠంలా రగులుతుండేదని ఆయన గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రం ఈశాన్య భారతావనిలో ఆర్థికశక్తిగా ఎదుగుతోన్న క్రమాన్ని విశదీకరించారు. 

 

రాష్ట్రంలోని నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ఉపాధి కల్పన కోసం చేపట్టిన పథకాల వివరాలను ఆయన వివరించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల తీరుతెన్నులను తరుణ్ గొగొయ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సదస్సుకు యూకేలోని భారత రాయబారీ జైమిని భగవతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే బ్రిటన్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్నారై లార్డ్ స్వరాజ్ పాల్తోపాటు పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరిన్ని వార్తలు