డల్లాస్‌లో ఘనంగా అష్టావధాన కార్యక్రమం

21 Aug, 2019 23:49 IST|Sakshi

డల్లాస్‌(టెక్సస్‌) : ఉత్తర టెక‍్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్‌) , ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆద్వర్యంలో ఆగస్టు18 న డల్లాస్‌లోని ఫ్రిస్కో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయంలో అష్టావధానం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 200 మందికి పైగా సాహితి ప్రియులు హాజరై సభను జయప్రదం చేశారు. టాంటెక్స్‌ అధ్యక్షులు చినసత్యం వీర్నపు సభను ప్రారంభించి అష్టావదానం నిర్వహించడానికి వచ్చిన డా. మేడసాని మోహన్‌గారికి సాదర స్వాగతం పలికారు. ఈ అష్టావదానం కార్యక్రమం తానా, టాంటెక్స్‌లు కలిసి నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముందుగా తాన్వి పొప్పూరి ఆలపిచిన అన్నమయ్య కీర్తనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దిగవంతాలకు వ్యాపించేలా తెలుగు భాషలలో అత్యంత క్లిష్టమైన అవధాన ప్రక్రియను డాక్టర్‌ మేడపాని మోహన్‌ తనదైన శైలిలో రక్తి కట్టించి అమెరికా నలుమూలల నుంచి విచ్చేసిన అవధాన ప్రియులను ఆకట్టుకున్నారు. అవధానం అంటే అవధులు లేని ఆనందం అనిపించేంతగా కార్యక్రమం సాగింది. ఈ అవధాన ప్రక్రియలో 8 మంది పృచ్ఛకులు పాల్గొన్నారు. ఈ పృచ్ఛకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద అవధాని గారిని పరీక్షించారు. మేడసాని మోహన్‌ ఎక్కడా కాగితం, కలం వాడకుండా వారు అడిగిన చందస్సులను చమత్కారంగా, ఛలోక్తులతో కూడిన సమాధానాలు ఇవ్వడం ద్వారా కార్యక్రమానికి విచ్చేసిన వీక్షకులను ఆనందింపజేశారు. అవధాన అంశాలలో శ్రీ ఊరిమిండి నరసింహరెడ్డి దత్తపది, శ్రీ తోటకూర ప్రసాద్‌ న్యస్తాక్షరి, శ్రీ ఉపద్రష్ట సత్యం మహాకవి ప్రసంగం, కుమారి మద్దుకూరి మధుమాహిత సమస్య, శ్రీ వేముల లెనిన్‌ వర్ణన, శ్రీమతి కలవగుంట సుధ, ఆశువు, శ్రీ కాజ సురేష్ నిషిద్దాక్షరి అంశాలతో, శ్రీ మాడ దయాకర్‌ తన అప్రస్తుత  ప్రసంగం, జలసూత్రం చంద్రశేఖర్ లేఖకుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అవధానం నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు శ్రీ జయశేఖర్ తాళ్ళూరి, టాంటెక్స్‌ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, సాంబ దొడ్డ బృందం డా. మేడసాని మోహన్ గారిరీ శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుస్తమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్‌ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బారావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, సుగన్ చాగర్లమూడి, కె.సి.చేకూరి , ప్రకాశ్‌రావు వెలగపూడి, ,ఎం.వి.యల్. ప్రసాద్, టాంటెక్స్‌ ఉపాధ్యాక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, ఉపాధ్యాక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్‌ తోపుదుర్తి, శ్రీకాంత్‌ జొన్నల, శరత్‌ ఎర్రం సహా మరికొంత మంది  ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు