ఆటా ఆధ్వర్యంలో 'యూఎస్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌' సెమినార్‌

26 Dec, 2019 22:08 IST|Sakshi

హైదరాబాద్‌ : అమెరికన్‌ తెలుగు అసొసియేషన్‌(ఆటా), తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(టీఎస్‌సీహెచ్‌ఈ) ఆధ్వర్యంలో ' యూఎస్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌' పై గురువారం సెమినార్‌ నిర్వహించారు. అమెరికాలో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్న విద్యార్థులకు సరైన ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యూహం, మార్గదర్శనం చేయడమే ఈ సెమినార్‌ ముఖ్య ఉద్దేశం.తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్‌ టి. పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఆటా ఆధ్వర్యంలో ఈ సెమినార్‌ను నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు సరైన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సెమినార్‌ నిర్వహించిన ఆటాకు, యూస్‌ కాన్సులేట్‌ జనరల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ స్టేట్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి వచ్చేవారు 80శాతం మంది గ్రామీణ విద్యార్థులే ఉంటారని, అందులోనూ మద్య,దిగువ తరగతికి చెందినవారే ఉంటారని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రాజెక్టు వర్క్‌కోసం వచ్చే విద్యార్థులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను వివరించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ కాన్సులేట్‌ కన్సులర్‌ సెక‌్షన్‌ హెడ్‌ ఎరిక్‌ అలెగ్జాండర్‌,  స్టేట్‌ యునివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ రిజిష్ట్రార్‌ రాజశేఖర్‌ వంగపతి, ఆటా ప్రెసిడెంట్‌ పరమేశ్‌ భీమ్‌రెడ్డి, భువనేశ్‌ కుమార్‌, జయదేవ్‌ చల్లా, కవిత(తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం), జాఫర్‌ జావేద్‌, ఫ్రొపెసర్‌ లింబాద్రి, ఫ్రొపెసర్‌ వి. వెంకటరమణ(టీఎస్‌సీహెచ్‌ఈ వైస్‌ చైర్మన్‌), సుల్తాన్‌ ఉల్‌ ఉలూం యునివర్సిటికీ చెందిన 50 మంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా