లాస్ ఏంజిల్స్‌లో ఆటా 16వ మహాసభలు

3 Oct, 2019 10:46 IST|Sakshi

వచ్చే ఏడాది జూలై 3 నుంచి 5వరకు ఆటా మహాసభలు 

కాలిఫోర్నియా : అమెరికా తెలుగు సంఘం(ఆటా) సాంప్రదాయంగా నిర్వహించే కిక్‌ఆఫ్‌ డిన్నర్‌ 2020 కాన్ఫరెన్స్‌ను సెప్టెంబర్‌ 28న లాస్‌ ఏంజిల్స్‌ లోని ఇర్విన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ సాంప్రదాయ కిక్‌ ఆఫ్‌ డిన్నర్‌లో సుమారు ఒక మిలియన్‌ డాలర్లు సేకరించారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వచ్చిన వారితో పాటు స్థానిక తెలుగు సంఘ నాయకులు, ఇతర మద్దతు దారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి మాట్లాడుతూ.. 16వ ఆటా మహాసభలు వచ్చే ఏడాది జూలై 3 నుంచి 5 వరకు లాస్‌ ఏంజిల్స్‌లోని అనాహైమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తామని తెలిపారు ఈ సమావేశానికి. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా(టాస్క్‌) స్థానిక అతిథిగా వ్యవహరించనుందని వెల్లడించారు. అదే విధంగా లాస్‌ ఏంజిల్స్‌ తెలుగు అసోసియేషన్‌(లాటా), తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రై-వ్యాలీ(టాట్వా) సహకారం అందించడానికి ముందుకొచ్చినట్లు తెలిపారు. 

డిసెంబర్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ఆటా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆటా వేడుకలకు ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ భువనేశ్‌ బూజల చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. ఆటా బోర్డు 16వ మహాసభలకు సారధ్యం వహించేందుకు కన్వీనర్‌గా నర్సింహ ద్యాసాని, కో కన్వీనర్‌గా విజయ్‌ తూపల్లి, కోఆర్డినేటర్‌గా రిందా సామ, లోకల్‌ కోఆర్డినేటర్‌గా బయపా రెడ్డి, కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌గా వెంకట్రామన మురారీ, కాన్ఫరెన్స్‌ కోడైరెక్టర్‌గా కాశప్ప మాధరం, కాన్ఫరెన్స్‌ కోడైరెక్టర్‌గా రవీందర్‌ రెడ్డి కొమ్మెర, అడ్వైజరీ చైర్‌గా మల్లిక్‌ బండా, కో-చైర్‌గా, మల్లిక్ బొంతు ను నియమించారు. ఈ సమావేశాలకు బంధు మిత్రులతో కలిసి రావాల్సిందిగా అధ్యక్షుడు పర్మేష్ భీంరెడ్డి  ఆహ్వానించారు. 

ఆటా మహాసభల అమలును పర్యవేక్షించడానికి బోర్డు కమిటీని నియమించారు. ఈ కమిటీలో పర్మేష్ భీంరెడ్డి-అధ్యక్షుడు, భువనేష్ బూజాలా ప్రెసిడెంట్-ఎలెక్ట్, కరుణకర్ అసిరెడ్డి గత అధ్యక్షుడు, నర్సింహ ధ్యసాని-కన్వీనర్, రిందా సమా-కోఆర్డినేటర్, వేణు సంకినేని-కార్యదర్శి, రవి పట్లోలా-కోశాధికారి, రఘువీర్ రెడ్డి, కృష్ణ ద్యాప, సతీష్ రెడ్డి, అనిల్ రెడ్డి, మరియు రామ్ అన్నాడి సభ్యులుగా ఉంటారు. అమర్ రెడ్డి మూలమల్లాను అంతర్జాతీయ సమన్వయకర్తగా నియమించారు.


 
ఆటా కార్యవర్గం లాస్ ఏంజిల్స్ బృందానికి ఈ సమావేశంలో పాల్గొన్న వారందరికీ గొప్ప ఆతిథ్యం అందించినందుకు, సమావేశాన్ని విజయం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింహ ధ్యాసాని-కన్వీనర్, రిందా సామ - సమన్వయకర్త, రవీందర్ రెడ్డి కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్, ప్రాంతీయ సమన్వయకర్త అభినవ్ చిర్రా, రవీందర్ ద్యాప, స్టాండింగ్ కమిటీ చైర్, శ్రీనాథ్ పేరం స్టాండింగ్ కమిటీ కో-చైర్, కుమార్ తాళంకి గత ప్రాంతీయ డైరెక్టర్, ప్రవీణ్ నయని గత ప్రాంతీయ సమన్వయకర్త మరియు వాలంటీర్లు సునీల్ తోకల, నిరంజన్ చలాసాని, నాగరాజ్ గౌడ్, సాగర్ గాదె, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జగనన్న దయతో సొంతూళ్లకు వచ్చాం

ఎస్‌.386 బిల్లుకు మద్దతుపై భారతీయ సంఘాల కార్యచరణ

సియాటిల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

బోస్టన్‌లో ఇళయరాజా పాటల హోరు

డాలస్‌లో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు

అక్టోబర్ 12, 13న సింగపూర్‌లో తిరుమల శ్రీవారి కల్యాణం

5న సంబవాంగ్ పార్క్‌లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు

ఘనంగా "టాక్ - చేనేత బతుకమ్మ - దసరా" సంబరాలు

డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

పల్లె సేవలో ప్రవాసులు

స్టాండింగ్‌ కమిటీలో ఇద్దరు తెలంగాణ ఎంపీలు

గల్ఫ్‌ వల.. యువత విలవిల

అంగరంగ వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలు

మహాత్మా గాంధీకి ఎంపీ లింగయ్య యాదవ్ ఘన నివాళి

వాషింగ్టన్‌ డి.సిలో వైఎస్సార్‌కు ఘనమైన నివాళి

మామిడిపండ్లు దొంగిలించాడని దేశ బహిష్కరణ

ప్రభుత్వాసుపత్రికి 20 కోట్లు ఇచ్చిన పూర్వవిద్యార్థులు

డాలర్‌ సిరి.. హెచ్‌ 1బీ వీసా ఉంది మరి

టాంటెక్స్‌ ఆధ్వర్యంలో ఫణినారాయణ వీణా మహా స్రవంతి

టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

అమెరికాలో భారత యువకుడి మృతి

ఆస్ట్రేలియాలో గణేష్ చతుర్థి వేడుకలు

సునీల్‌ గావస్కర్‌ నయా ఇన్నింగ్స్‌..

న్యూజెర్సీలో తెలంగాణా విమోచన దినోత్సవం

అక్కినేని అంతర్జాతీయ అవార్డులు ప్రకటన

ఆ విషయంలో మనోళ్లే ముందున్నారు!

సిలికానాంధ్ర మనబడి విద్యాసంవత్సరం ప్రారంభం

గావస్కర్‌ నయా రికార్డ్‌!

ఉబర్‌లో బగ్‌ను కనిపెట్టిన భారతీయుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గోపీచంద్‌ ‘28’వ చిత్రం షురూ

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

‘సైరా’తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

హీరో తండ్రిపై కమిషనర్‌కు ఫిర్యాదు

‘ఇవాళ రాత్రి నీకు డిన్నర్‌ కట్‌’

‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’