ఆన్‌లైన్‌లో 'ఆటా' పాట‌ల పోటీలు

10 Jul, 2020 09:39 IST|Sakshi

వాషింగ్ట‌న్‌: అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఝుమ్మంది నాదం” పాటల పోటీలను జూన్ 28 నుంచి ఆగష్టు 2 వరకు నిర్వ‌హిస్తోంది. అందులో భాగంగా జూన్ 28న స‌బ్‌జూనియర్స్ నాన్ క్లాసిక‌ల్‌, జూలై 4, 5 తేదీలలో జూనియర్స్ నాన్ క్లాసికల్ పాటల పోటీలను ఆన్‌లైన్‌లో జూమ్ ద్వారా నిర్వ‌హించారు. దాదాపుగా 82 మంది గాయనీ గాయకులు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి ఆస‌క్తితో పాల్గొన్నారు. శ్రీ రామ‌కృష్ణా రెడ్డి ఆల బోర్డు ఆఫ్ ట్ర‌స్టీ, శార‌దా సింగిరెడ్డి ఝుమ్మంది నాదం చైర్ కార్యక్ర‌మ‌ నిర్వాహ‌కులుగా వ్య‌వ‌హ‌రించారు.

అమెరికా, ఇండియా నుంచి క‌ర్నాటిక్ మ్యూజీషియ‌న్ వాస‌గోపినాధ్ రావు, సంగీత ద‌ర్శ‌కులు శ్రీని ప్ర‌భ‌ల‌, సంగీత ద‌ర్శ‌కులు రాజశేఖ‌ర్ సూరిభొట్ల‌, ప్లేబ్యాక్ సింగ‌ర్‌, సంగీత ద‌ర్శ‌కులు నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగ‌ర్ నూత‌న మోహ‌న్‌, ప్లే బ్యాక్ సింగ‌ర్ మాన‌స ఆచార్య‌, ప్లే బ్యాక్ సింగ‌ర్ ప్ర‌వీణ్ కుమార్ కొప్పోలు న్యాయ‌నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. (ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు)

ఆటా సంస్థ అయిదు రీజియ‌న్స్.. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్‌, మిడ్ వెస్ట్‌, సౌత్ వెస్ట్‌, వెస్ట్‌ల నుంచి స‌బ్ జూనియ‌ర్స్ నాన్ క్లాసిక‌ల్ కేట‌గిరి గాయ‌నీమ‌ణులు.. అమ్రిత వుడుముల‌, అన‌న్య జొన్నాదుల, అన‌న్య యెర గుడిపాటి, కృతి రాచ‌కొండ‌, మ‌హి ఓత్ర‌, మిత్ర చెబియ, ప‌ర్జిక వుల్ల‌గంటి, శ‌ర‌ణ్య ఎస్‌, త‌న్వి గొంగ‌ల‌, వైష్ణ‌వి రెండుచింత‌లను ఫైన‌లిస్ట్స్‌గా ఎంపిక చేశారు.

ఆటా ప్రెసిడెంట్ ప‌ర‌మేష్ భీంరెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భువ‌నేశ్ రెడ్డి భుజాల‌, బోర్డు ఆఫ్ ట్ర‌స్టీస్, స్టాండింగ్ క‌మిటీ చైర్స్‌, రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్స్‌, ఆటా కాన్ఫ‌రెన్స్ క‌న్వీన‌ర్, కాన్ఫ‌రెన్స్ టీం, ఝుమ్మంది నాదం టీం, సోష‌ల్ మీడియా టీం అమెరికాలో ఉన్న గాయ‌నీగాయ‌కుల నైపుణ్య‌త‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి ఆటా సంస్థ‌ ఏర్ప‌రిచిన ఈ గొప్ప స‌ద‌వ‌కాశాన్ని ఉప‌యోగించుకుని సంగీత విద్వాంసుల ముందు వారి సంగీత ప్ర‌తిభ‌ను చూపిస్తున్న గాయ‌ని గాయ‌కులంద‌రికీ అభినందన‌లు తెలియ‌జేశారు.

ఆటా సంస్థ లైవ్ ప్ర‌చారం చేస్తున్న టీవీ చాన‌ళ్ల‌కు, అలాగే తెలుగు ఎన్నారై రేడియో, టోరీ రేడియో, మీడియా మిత్రులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఝుమ్మంది నాదం పాట‌ల పోటీ విజ‌య‌వంతానికి కృషి చేసిన ఆటా కార్య‌వ‌ర్గ బృందానికి ఆటా ప్రెసిడెంట్ ప‌ర‌మేష్ భీంరెడ్డి ప్ర‌శంస‌లు తెలిపారు. (ఆటా అధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు)

మరిన్ని వార్తలు