ఆటా ఆధ్వర్యంలో మెగా హెల్త్‌ క్యాంప్‌

18 Aug, 2019 22:34 IST|Sakshi

వాషింగ్టన్‌ : ప్రవాస తెలుగు వారికే కాకుండా ప్రవాస భారతీయులందరికీ అండగా నిలిచే ఆటా, ఆగస్టు 17న అత్యున్నత స్థాయిలో హెల్త్ క్యాంపు నిర్వహించింది. అమెరికాలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేపట్టే ఆటా నేడు చేసిన హెల్త్ క్యాంపు వల్ల పలు వర్గాల వారికి బహు విధాలా ప్రయోజనకరంగా వారి సేవలు అందించారు. ఆట వాషింగ్టన్‌ డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు ఆరు వందలకు పైగా అమెరికా వాసులు, వారి బంధు మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అతి విజయవంతంగా చేసారు. హేర్నడోన్ కమ్యూనిటీ సెంటర్‌ లో జరిగిన ఈ ప్రోగ్రాం ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2 వరకు నడిచింది. కార్యక్రమంలో ౩౦ మంది పైగా డాక్టర్లు పాల్గొన్నారు. వైద్యో నారాయణో హరి:  అన్నట్లుగానే వచ్చిన వైద్యులు చాలా ఓపికతో వచిన వారికీ సలహాలు ఇచ్చి వారి సమస్యలకు స్పందించారు. వచ్చిన వారందరు పలు స్పెషాలిటీస్‌ లో ఆరితేరిన నిపుణులు మరియు 10ఏళ్లకు పైగా అనభవాం కలిగిన వైద్యులు కావడం విశేషం. అరుదైన విధంగా హృదయేతర కార్డియాలజిస్ట్‌ , కిడ్నీ స్పెషలిస్ట్స్‌,  ఇంటర్నల్‌ మెడిసిన్, దంత మరియు ఆర్థోపెడిక్ డాక్టర్స్‌, పిల్లల డాక్టర్స్‌, న్యూరాలజీ, అల్లెర్జీస్‌ సంబంధించిన నిపుణులను మరియు అనేక ఫార్మాసిస్ట్స్‌లను ఒకే చోటుకు తీసుకు వచ్చిన ఖ్యాతి ఆటా ఒక్కదానికే దక్కింది. వారికి వారే సాటి! 

అన్ని రకాల వైద్యులు ఒకే చోట ఉన్నందున వచ్చిన ప్రతి వ్యక్తి  హర్షం వ్యక్తం చేశారు. ఇన్సూరెన్స్‌  ఉన్నా ఎన్నోసార్లు తిరగాల్సిన అవసరం లేకుండా ఆటా ఈ విధంగా తమకి ఎంతో సాయం చేసిందని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రక్త పరీక్ష మరియు బీపీ చెకప్‌ చేయించుకొని డాక్టర్ల చేత సలహాలు పాందారు. డాక్టర్‌  రామకృష్ణన్‌​ గారి హృదయ సమస్యల పరమైన అవగాహన మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం, డాక్టర్‌ వీరపల్లి గారి  వ్యాధుల లక్షణాలు తెలుసుకోవడం, డాక్టర్‌ పాలువోయ్ గారిచే అల్లెర్జిఎస్‌ ఎలా అరికట్టాలో వినడం తమకు ఎంతో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. వచ్చిన వారందరూ ఆటా ఈ క్యాంపు ద్వారా తమ రుగ్మతలను సకాలంలో వైద్య  సదుపాయాలందించిందని అభినందించారు. వచ్చిన వైద్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌  భువనేశ్ మాట్లాడుతూ.. సామాజిక ప్రయోజనమే లక్షంగా పెట్లుకొని ఈ ప్రొగ్రాం నిర్వహించామని , వైద్య సదుపాయాలు తెచ్చామని , ఆరోగ్యకరమైన అవగాహన కల్సించాలని , సామాజిక అభ్యున్నతికి సర్వ విధాలా ఆటా తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలియచేస్తూ , డాక్టర్‌ వెంకట్‌ గారి ప్రేరణనను అభినంధిస్తూ , వైద్యులందరికి కృతజ్ఞత భావంగా మెమెంటోలని సమర్పించారు .ఇంత పెద్ద ఎత్తున క్యాంపు ఎవరు చేయలేదని , ఇదే చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. ఆట బోర్డు అఫ్ ట్రస్టీస్‌ సౌమ్య కొండపల్లి  మరియు జయంత్ చల్ల గార్లు మాట్లాడుతూ.. ఆట సంవత్సరం పొడువునా అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ప్రవాస తెలుగు వారికీ ఉన్నత విద్యలో స్కాలర్‌షిప్స్ ఇస్తుందని, భారతదేశంలో మానవీయ సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తుందని పేర్కొని , ఇంత భారీ ఎత్తున క్యాంపు చేసినందుకు ఆట డీసీ చాప్టర్‌ కు అభినందలు తెలిపారు .

మరిన్ని వార్తలు