అట్లాంటాలో అటా ఉచిత వైద్య​ శిబిరం..

18 Oct, 2017 17:10 IST|Sakshi

అట్లాంటా: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(అటా)ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అక్టోబర్‌ 14న అట్లాంటాలోని హిందూ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్యాంపులో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమాలు చెపట్టారు. దీనికి సాయి హెల్త్‌ ఫేయిర్‌, జార్జియా ఇండియన్‌ నర్స్‌ అసోసియేషన్‌లు సహకారం అందించాయి. ఈ ఉచిత​ వైద్య శిబిరంలో ప్రత్యేక విబాగాల్లో నిష్ణాతులైన 20 డాక్టర్లు, చాలామంది డాక్టర్లు, వాలంటీర్స్‌ పాల్లొని  సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి దాదాపుగా 200 మందికిపైగా పాల్గొని ఉచిత సేలు పొంది కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో డయాబెటిక్‌, న్యూట్రిషన్‌, హైపర్‌ టెన్షన్‌, ధూమపానం వల్ల వచ్చే నష్టాలను ఆ రంగంలో నిష్ణాతులైన డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొప్ప యోగ మాస్టర్‌తో యోగా సెషన్‌ కూడా పెట్టారు.  ఈ కార్యక్రమం డాక్టర్‌ సుజాత రెడ్డి, డాక్టర్‌ సిమాలా ఎర్రమల్‌, డాక్టర్‌ శ్రీనిగంగాసనీ, దక్షిణ ప్రాంతంలోనే ప్రొఫెషనల్‌ డాక్టర్లు ఈ శిబిరాన్ని ముందుండి నడిపించారు. అంతేకాక గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, కార్డియాలజి, డెర్మటాలజీ వివిధ రంగాల్లో నిపుణులైనా 20 మంది డాక్టర్లు పరీక్షలు జరిపి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యం అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో పాల్గొన డాక్టర్లందరీకి అటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అంతేకాక ఈ కార్యక్రమానికి ఆడిటోరియం ఇచ్చిన హిందూ ఆలయ బోర్డు సభ్యలకు కృతజ్ఞతలు తెలిపారు.

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ బోర్డు ధర్మకర్తలు అనిల్‌ బొడ్డిరెడ్డి, వేణు పిసికె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం చాలా విజయవంతం అయిందని అన్నారు. చాలా తక్కువ సమయంలోనే  వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ఆటా అసోసియేషన్‌ ట్రేజరర్‌, ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ మెంబర్‌ కిరణ్‌ పాసం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం వృద్దులకు, విద్యార్థులకు, గాయపడిన వారికి ఎంతో ఉపయోడపడిందని అన్నారు. 

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు కరుణాకర్‌ అశిరెడ్డి మాట్లాడుతూ.. ఉచిత వైద్యశిబిరంలో పనిచేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.  సేవ కార్యక్రమాల్లో భాగంగా అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ డిసెంబర్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్యశిబిరాలు చేపడుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ రిజనల్‌ డైరెక్టర్‌ తిరుమల్‌ పిట్ట, రిజనల్‌ కో- అర్డినేటర్స్‌ ప్రశాంత్‌ పొద్దుటురి, శ్రావణి రచ్చకుల్లా, శ్రీరామ్‌, శ్రీనివాస్‌, హెల్త్‌ కమిటీ కో చైర్‌ రమణ రెడ్డి బాతుల, స్టాడింగ్‌ కమిటీ చైర్మన్‌లు శివ రామడుగు, నందా చాట్ల, శ్రీధర్‌, అటా వాలంటీర్స్‌లు పాల్గొన్నారు.


 

>
మరిన్ని వార్తలు