ఘనంగా ఆటా డే వేడుకలు

24 Apr, 2018 22:45 IST|Sakshi

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్ ‌(ఆటా) మరో వేడుకకు సిద్ధమైంది. అమెరికాలోని తెలుగు వారందరిని ఏకం చేయుటకు,  తెలుగు సంస్కృతిని చాటిచెప్పెందుకు అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్  వేడుకలను మే 31, జూన్‌ 1, 2 తేదీల్లో డల్లాస్‌ లో నిర్వహిస్తున్నట్లు సభ నిర్వాహాకులు తెలిపారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ‘ ఆటా డే నష్వీల్లే’ ను ఏప్రీల్‌ 21న నిర్వహించారు. ఈ వేడుకలకు 100 మంది అతిధులు హాజరైయారు. ఈ కార్యక్రమంలో యాక్టర్‌ భానుశ్రీ  ఆటలు, పాటలు, ఉత్తేజభరితమైన సంగీతాన్ని, నృత్యాన్ని ప్రదర్శించి  అందరిని అలరించారు. ఆటా టీం  హాస్యభరిత చర్చలతో, ఉత్సహాభరితంగా సాగింది.

వేడుకల అనంతరం అతిథులకు నష్వేల్లీ నుంచి పారడైస్‌ బీర్యానీతో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ఆటా ప్రాంతీయ కో ఆర్డీనేటర్‌ నరేంద్ర రెడ్డి నూకల, రామకృష్ణా రెడ్డి ( కమ్యూనిటి చైర్‌), సుశీల్‌ చంద్రా ( స్టాండింగ్‌ కమిటి, కో-చైర్‌), కిషోర్‌ రెడ్డి గుడూర్‌, ఆధ్వర్యంలో జరిగాయి. వేడుకల నిర్వాహాణకు 25 వేల డాలర్లు విరాళాలు  సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షులు, కరుణాకర్‌ అసిరెడ్డి, అనిల్‌ బోడిరెడ్డి, వెబ్‌ కమ్యూనిటీ చైర్మన్‌ ఉమేష్‌ ముత్యాల, తిరుపతిరెడ్డి యర్రంరెడ్డి,  వివిధ ప్రాంతాల నుంచి తెలుగు ప్రముఖులు, ప్రతినిధులు  హజరయ్యారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు