వైఎస్‌ జగన్‌పై దాడిని ఖండించిన అట్లాంటాలోని ఎన్‌ఆర్‌ఐలు

31 Oct, 2018 14:28 IST|Sakshi

అట్లాంటా : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని అట్లాంటా వైఎస్సార్‌సీపీ చాప్టర్‌ సభ్యులు ఖండించారు. తనను తాను గొప్ప పరిపాలనాధక్షుడుగా చెప్పుకునే సీఎం చంద్రబాబు హయాంలో ప్రతిపక్షనేతపై దాడి జరిగిందని, ఈ ఘటన ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి నిదర్శనమన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే మానవతా కోణంలో చూడాల్సింది పోయి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దాడిని ఖండించకుండా, ఖండించిన వారిపై విమర్శలు చేయడం ద్వారా తన రాక్షసత్వాన్ని మరోసారి భయటపెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే ఈ హత్యాయత్నం మీద సీబీఐ దర్యాప్తు జరిపించాలని దోషులను కఠినంగా శిక్షంచాలని డిమాండ్‌ చేశారు.
  
ఈ నిరసన కార్యక్రమంలో ధనుంజయ్‌, వేణు రెడ్డి పంట, రాజ్‌ అయిలా, రామ్‌ భూపాల్‌ రెడ్డి, క్రిష్ణ నర్సింపల్లె, జై పగడాల, క్రిష్ణ, కిరణ్‌ కందుల, శ్రీనివాస్‌ కొట్లూరి, ధనుంజయ గడ్డం, వినోద్‌, జగదీశ్‌ గంగిరెడ్డి, సంతోష్‌, అమర్‌లతో పాటూ పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా