మంచి మనసు చాటుకున్న ఆస్టిన్ తెలుగు ప్రజలు 

1 Feb, 2020 14:38 IST|Sakshi

సాక్షి, వైఎస్‌ఆర్‌ కడప: వైఎస్‌ఆర్‌ జిల్లా రాజుపాళెం మండలం, అర్కటవేముల గ్రామానికి చెందిన రైతు నాయకంటి గురువి రెడ్డి  (62) గత నెల పొలంలో సేద్యం చేసేందుకు వెళ్ళాడు. అయితే పొలంలోకి వెళ్లే సమయంలో ఎత్తుగా ఉన్న పొలంలో నుంచి కిందకి దిగుతుండగా కాడికి కట్టిన వృషభరాజం కిందకి దిగుతుండగా గొర్రు నగలు పైన ఉన్న విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు తగలడంతో వృషభరాజములతో పాటు రైతు గురువి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. భర్త మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మృతుడి భార్య భారతి గుండెలు పగిలేలా రోదించారు. గురువి రెడ్డి గారికి ఎద్దులతో విడదీయరాని బంధం. విధి విచిత్రం ఏమోగానీ వ్యవసాయం పనులకోసం  వెళ్లిన ఆ రైతు కాడి ఎద్దులతో పాటు తాను కూడా మృతి చెందడం అందరిని కలచివేసింది.

రైతు కటుంబానికి భరోసా
ఈ విషయం తెలుసుకున్న అమెరికా, ఆస్టిన్ లో నివసిస్తున్నటువంటి తెలుగువారి మనసు చెలించి రైతు కుటుంబానికి భరోసా ఇవ్వడానికి 35000 రూపాయలు ఆత్మీయ ట్రస్ట్ ఛైర్పర్సన్ శెట్టిపి  జయచంద్ర రెడ్డి గారికి పంపించి, ఆ మొత్తాన్ని గురివి రెడ్డి తనయుడు నాయకంటి పెద్ద లక్ష్మి రెడ్డి గారికి ప్రొద్దుటూరు డీఎస్పీలో సారి సుధాకర్ గారు, ఆత్మీయ ట్రస్ట్ చైర్‌పర్సన్ శెట్టిపి జయచంద్ర రెడ్డి గారి చేతుల మీదగా చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డీఎస్పీ గారి తో పాటు ముఖ్య అతిథులుగా  సీఐ విశ్వనాధ్రెడ్డి హాజరయ్యారు. ఎస్‌ఐ లక్ష్మినారాయణ గారు మాట్లాడుతూ,  దేశం వదిలి ఎంతో దూరంలో నివసిస్తున్నా, విషయం తెలుసుకొని రైతు గురువి రెడ్డి కుటుంబానికి సహాయం చేయడానికి వచ్చిన అమెరికా, ఆస్టిన్ తెలుగు వారిని  ప్రశంసించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు