ప్రజాసంకల్పయాత్రకు ఆస్టిన్‌లో ఎన్‌ఆర్‌ఐల సంఘీభావం

26 Sep, 2018 09:21 IST|Sakshi

టెక్సాస్ : కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోందని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆస్టిన్‌లోని ప్రవాసాంధ్రులు తెలిపారు. జనం కోసం జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారని తెలిపారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలంతా ఆవేదన చెందుతున్నారని.. అందుకే పాదయాత్రలో వైఎస్‌ జగన్‌కు అండగా నిలుస్తున్నారన్నారని తెలిపారు. 

జననేత ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా అమెరికాలో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో వైఎస్‌ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు సుబ్బా రెడ్డి చింతగుంట, పరమేశ్వర రెడ్డి నంగి, మల్లికార్జున రెడ్డి ఆవుల, రవి బల్లాడ,నారాయణ రెడ్డి గండ్ర, మురళి బండ్లపల్లి, కొండా రెడ్డి ద్వారసాల, కరుణ్ రెడ్డి, వెంకటేష్ భాగేపల్లి, స్వాదీప్ రెడ్డి, హనుమంత రెడ్డి, ప్రవర్ధన్ చిమ్ముల, నర్సి రెడ్డి గట్టికుప్పల, రమణ రెడ్డి కిచ్చిలి, శివ ఎర్రగుడి, గురు చంద్రా రెడ్డి, దేవేందర్ రెడ్డి, రామ కోటి రెడ్డి, యశ్వంత్ రెడ్డి గట్టికొప్పుల, వెంకట గౌతమ్ రెడ్డి, మోహన్ రెడ్డి, లోకేష్, ప్రదీప్ లక్కిరెడ్డి, సుధాకర్ రెడ్డి, విట్టల్ రెడ్డి, హేమంత్, అనంత్, కమల్, రామి రెడ్డి, శివ ననుష్యల, వసంత్ రెడ్డి, శ్రీ దీపక్, శ్రీని చింత,  ప్రవీణ్ కర్నాటి, మధు, వ్యాస్, సుజిత్, రేజేష్ కేతి రెడ్డి, వెంకట రెడ్డి కొండాలతో పాటూ పలువురు కేక్ కట్ చేసి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలిపారు. శ్రీధర్ కొర్సపాటి, పుల్లారెడ్డి ఎదురు, కుమార్ అశ్వపతి, అశోక్ గూడూరు, వెంకట శివ నామాల, సచి, వెంకట రామి రెడ్డి ఉమ్మలు ప్రత్యక్షంగా హాజరు కానప్పటికీ వీడియోకాన్ఫెరెన్స్‌లో పాల్గొని తమ మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు