జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

5 Oct, 2019 18:51 IST|Sakshi

బెర్లిన్‌: తెలంగాణా సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మ సంబరాలు జర్మనీలోని మ్యూనిక్ నగరంలో కన్నుల పండుగలా జరిగింది. ఈ పండుగను వరుసగా నాలుగోసారి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 200లకుపైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది.. ఉయ్యాల పాటలు పాడుతూ అందరినీ అలరించారు. పసందైన వంటకాలతో వేదిక గుమగుమలాడింది. చిన్న పిల్లలు సైతం తమ ప్రాంత సంస్కృతిని చూసి ఆనందించారు.
|
తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ సంబరాలు జర్మనీలోనూ ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎన్‌ఆర్‌ఐలు హర్షం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారందరు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవాలని ఎన్నారైలు సుష్మ, శ్రీలత, మానస, కీర్తన, పుష్ప, మంజుల, సృజన, సంగీత, శైలజ, శిరీష తదితరులు కోరారు. కార్యక్రమాన్ని కన్నుల విందుగా జరిపిన దేవేందర్‌కు, కమిటీ సభ్యులకు ఎన్‌ఆర్‌ఐలు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు