మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

24 Sep, 2017 08:32 IST|Sakshi

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. మలేషియా కౌలాలంపూర్లోని పీపీపీఎం ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ వాసులు భారీగా తరలి వచ్చారు.  

ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా తెలంగాణ ఆడపడచు మిస్ ఆసియా ఇంటెర్నేషనల్, జాతీయ పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీఠాకూర్, ఇండియన్ హై కమిషనర్ అఫ్ మలేషియా టిస్ తిరుమూర్తి, మలేషియా తెలుగు సంఘం ప్రెసిడెంట్ డా అచ్చయ్య కుమార్ రావుతో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

ఈ సంబరాలలో మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో కోలాహలంగా పాటలను పాడుతూ బతుకమ్మఆడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్క జాము అయై చందమామ, ఒక్కొక్క పువ్వేసి చందమామ,, వంటి పాటలతో మలేషియా మారుమోగింది. రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అందంగా అలంకరించిన బతుకమ్మలకు ఈ సందర్భంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ 6 గ్రాముల బంగారాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. మిస్ ఆసియా రష్మీఠాకూర్ తెలంగాణ ఆడపడుచులతో బతుకమ్మ, కోలాటం ఉత్సహాంగా ఆడి పాడి సందడి చేశారు.

రష్మీఠాకూర్ మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ వాసులు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మ సంబరాలు, తెలంగాణ పండుగలు జరుపోకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విదేశాల్లో తెలంగాణ సంస్కృతి కోసం కృషి చేస్తున్నందుకు మలేషియా తెలంగాణ అసోసియేషన్ను అభినందించారు.

మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ సంవత్సరం మూడు రోజుల పాటు తెలుగు వారు ఉండే ప్రతి చోట బతుకమ్మ వేడుకలను మన సంస్కృతికి అద్దం పట్టేలా ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ  కార్యక్రమానికి  స్పాన్సర్గా వచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయడానికి సహకరించిన మైట కోర్ కమిటీని వాలంటీర్లుగా ముందుకి వచ్చిన సభ్యులను అయన అభినందించారు.

ఈ  కార్యక్రమంలో మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి వైస్ ప్రెసిడెంట్ చోపరి సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు కనుమూరి రవి వర్మ, చిట్టి బాబు చిరుత, బూరెడ్డి మోహన్ రెడ్డి, వెంకట్ రమణా రావు, రవి చంద్ర, కిరణ్మయి, గడ్డం రవీందర్ రెడ్డి, కృష్ణ ముత్తినేని, మారుతి, సుందర్, వివేక్, అశోక్, వెంకట్, కిరణ్ అనుగంటి, కార్తీక్, రవితేజ, అనిల్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా