సిడ్నీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

6 Oct, 2019 19:33 IST|Sakshi

సిడ్నీ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా.. ఖండాంతరాలకు వ్యాపించాయి. వాడవాడలా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. 'ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్‌ అసోసియేషన్‌' అధ్వర్యంలో సిడ్నీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని తెలుగువారందరూ వేడుకలలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో హాజరై ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా సిడ్నీలో తెలంగాణ వాతావరణం అలుముకుంది. ఈ వేడుకల్లో విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆట్సా ప్రెసిడెంట్‌ రాజ్‌ బద్దం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు