మెల్‌బోర్న్‌లో బీజేపీ విజయోత్సవం

10 Jun, 2019 20:45 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : లోక్‌సభ ఎన్నికలల్లో బీజేపీ అఖండమెజారిటీతో రెండోసారి విజయం సాధించడం సందర్భంగా ఆస్ట్రేలియాలోని ఆపార్టీ మద్దతుదారులు విజయోత్సవ సభ నిర్వహించారు. వైందమ్‌ కౌన్సిల్ మాజీ డిప్యూటీ మేయర్‌ గౌతమ్‌ గుప్తా ఆధ్యర్యంలో మెల్‌బోర్న్‌ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన బీజేపీ మద్దతుదారులు పెద్దఎత్తున హాజరయ్యారు. మొదటగా వందేమాతరం ఆలాపనతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం ఇటీవల కేరళ, కర్ణాటక, తెలంగాణలో హత్యకు గురైన బీజేపీ కార్యకర్తలకు అంజలి ఘటించారు. అనంతరం కొన్ని సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అమరెందర్‌రెడ్డి కోత, మహేశ్‌ బద్దం, శ్రీపాల్‌ బొక్క, రామ్‌ నీత, వంశీ కొత్తల, దీపక్‌ గడ్డె, విశ్వంత్‌ కపిల ఇతర బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు