సింగపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

21 Jul, 2019 19:42 IST|Sakshi

బోనాల పండుగ వేడుకలు దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా సింగపూర్‌లో ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పండగ వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్‌’ లోని శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్‌లో తెలంగాణ ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ  ప్రాంతానికి చెందిన వారే కాకుండా..  సుమారు 700 మంది భక్తులు పాల్గొన్నారు.  బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ‘తీన్ మార్’ స్టెప్పులు వేసి అలరించారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. ప్రజలకు మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని టీసీఎస్‌ఎస్‌ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

ఈ వేడుకల అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. బోనాల పండుగను సింగపూర్‌కు మూడేళ్ల క్రితం పరిచయం చేశామని టీసీఎస్‌ఎస్‌ పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలోటి‌సి‌ఎస్‌ఎస్ ఎప్పుడు ముందుంటూ నిర్విరామంగా కృషి చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో బోనాల పండుగలో పాల్గొని అత్యంత వైభవంగా జరుపుకునేందుకు సహకరించిన ప్రజలందరికి, ప్రసాద దాతలకు సొసైటీ తరపున.. సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వేడుకల్లో టీసీఎస్‌ఎస్‌ ఉపాధ్యక్షులు గడప రమేశ్, గర్రేపల్లి శ్రీనివాస్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, కార్యనిర్వాహక సభ్యులు..  ప్రవీణ్ కుమార్ చేన్నోజ్వాల, ప్రాంతీయ కార్యదర్శులు..   ఎమ్ దుర్గ ప్రసాద్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గోనె నరేందర్, గింజల సురేందర్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు నంగునూరి వెంకట్ రమణ, పెరుకు శివ రామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, కల్వ లక్ష్మణ్ రాజు, బొండుగుల రాము, జూలూరి సంతోష్ కుమార్, నడికట్ల భాస్కర్, రోజారమణి బొడ్ల, జూలూరి పద్మజ, కొల్లూరి శ్రీధర్, కరుణాకర్ గుత్తికొండ, ఆవుల శివ ప్రసాద్ తదితరులు పాల్గొని..  ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా  బోనాల వేడుకల స్పాన్సర్స్..  మాలబార్ గోల్డ్ & డైమండ్స్ ధీరజ్, వేలన్ ట్రేడింగ్, టేస్ట్ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఐ ఫ్యాషన్స్, రియో కాఫీ.. ఇతర దాతలకు సొసైటీ సభ్యులు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలకు సమన్వయ కర్తలుగా గోనె రజిత, దీపా నల్ల, సౌజన్య నంగునూరి, గార్లపాటి లక్ష్మా రెడ్డి, ప్రదీప్ రెడ్డి, లక్కారి గంగాధర్, మడిగె రాజు, మల్లా రెడ్డి మిటపల్లి, తౌట గంగాధర్, అనుపురం శ్రీనివాస్, జుట్టు ఉమేందర్, టి. శ్రీనివాస్, మంత్రి సాయిరాం, తుర్క శ్రీనివాస్, కటుకం మారుతి, మనోజ్  గార్లు   వ్యవహరించారు. పోతరాజుల వేషాలు మరియు పులి వేషాలు వేసిన పాచంపల్లి శ్రీధర్, నేరెళ్ళ శ్రీనాథ్, చాడ సంతోశ్ రెడ్డి, వెంగళదాస్ తిరుపతి, అద్ది మల్లేశం గార్లకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు.
 

మరిన్ని వార్తలు