7 Aug, 2018 20:47 IST|Sakshi

హౌస్టన్‌ : తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హౌస్టన్‌ (టాగ్‌) ఆధ్వర్యంలో ప్రవాసులు బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా బోనాలను హౌస్టన్‌లో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ ఏడాది బోనాల వేడుకను స్థానిక సాయి బాబా జలరం మందిర్‌లో అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకలో దాదాపు ఆరు వందల మంది భక్తులు పాల్గొన్నారు. పోతురాజు నృత్యాలతో కార్యక్రమం అంతా కోలాహలంగా మారింది. పద్మ కొత్తకొండ అమ్మవారి బోనాలను అందంగా అలంకరించారు. స్థానిక బిర్యానీ పాట్‌ యజమాని శ్రీధర్‌ కాంచనకుంట్ల అక్కడికి విచ్చేసిన భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. టాగ్‌ అధ్యక్షులు విజయ్‌ దేవిరెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ వీరేందర్‌ వచ్చిన భక్తులందరికి ధన్యవాదాలు తెలిపారు. టెక్సాస్‌ డెమోక్రాట్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్‌ కులకర్ణి పాల్గొని భక్తులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు