లండన్లో ఈ నెల 21న బోనాల జాతర

19 Jul, 2013 16:33 IST|Sakshi

తెలంగాణ ఎన్నారై ఫోరం (TeNF) ఆధ్వర్యంలో ఈ నెల 21న లండన్ నగరంలో 'లండన్ బోనాల జాతర' నిర్వహించనున్నట్లు ఆ అసోసియేషన్ మీడియా ప్రతినిధి పిట్ల శ్యాంసుందర్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆయన తెలిపారు.

 

తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీ అధికార ప్రతినిధి రామచందర్ రావు, రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్లతోపాటు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుంట్లూరి వెంకటేష్ గౌడ్ తదితరులు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ బోనాల జాతరకు బ్రిటన్లోని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్నారైలంతా హాజరై తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలని శ్యాంసుందర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు