సింగపూర్‌లో ఘనంగా బోనాల జాతర

23 Jul, 2018 14:50 IST|Sakshi

సింగపూర్‌ : సింగపూర్‌లోని శ్రీ అరసకేసారి శివన్ టెంపుల్‌లో బోనాల జాతర అంగరంగవైభవంగా జరిగింది. డప్పుల సప్పుళ్ల మధ్య అమ్మవారి ప్రదర్శన, పోతురాజుల విన్యాసాల నడుమ సింగపూర్‌లోని తెలుగు వారు బోనాల జాతరను జరుపుకున్నారు. ఈ జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒగ్గు కళాకారుడు బొల్లి రాజు యాదవ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ జాతరలో సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారు సుమారుగా 800 మంది పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలంగాణ వాసులందరి ఆధ్వర్యంలో , తెలంగాణ బోనాల జాతరను తేదీ 22 (ఆదివారం) నాడు శ్రీ అరసకేసారి శివన్ టెంపుల్ నందు డప్పుల డీజే సప్పుడుల మధ్య, పోతురాజుల విన్యాసాల నడుమ పిల్లలు పెద్దలు అందరు కలిసి అంగరంగ వైభవంగా బోనాల జాతర జరుపుకున్నారు.

ఈ జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఒగ్గు కళాకారుడు బొల్లి రాజు యాదవ్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ జాతర వేడుకలో సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జాతర నేపథ్యంలో సింగపూర్ సిటీ నలుమూలల నుండి బస్సు సౌకర్యం కల్పించారు. ముందుగా కార్యక్రమంలో  కవిత, సునీత, అనిత  ఆధ్వర్యంలో బోనాలు తయారు చేసి గుడికి తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్ది శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బోనాల పండగకు పిలవగానే వచ్చిన భక్తులకి పేరు పేరున  కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ వారి కోసం రాబోయే రోజుల్లో మరిన్ని  ఉత్సవాలను జరుపుతామన​ఆనరు. ఈ కార్యక్రమంలో  వీరమళ్ళ కృష్ణ ప్రసాద్, ఏళ్ళ రాంరెడ్డి, మర్రి వెంకటరమణ రెడ్డి, నల్లావుల రాజేందర్ రెడ్డి, కట్ట రాజిరెడ్డి, చిలుక సురేష్, చిట్ల విక్రమ్ పటేల్, గోపగోని దామోదర్, ఆర్ సి రెడ్డి, పింగిళి భరత్, అల్లోల మురళి రెడ్డి, నల్ల వేణు, గడిపల్లి చంద్ర, గోసంగి శంకర్, అంకటి తిరుపతి, చెట్టిపల్లి మహేష్, చల్ల కృష్ణ, బైరి రవి, యాసరవేణి విజయ్, వీర చందు, ముదమ్‌ అశోక్‌ తదితరులు పాల్గున్నారు.

మరిన్ని వార్తలు