‘స్టార్టప్స్‌తో భాగస్వామ్యాలకు బ్రిటన్‌ సంస్థల ఆసక్తి’

8 May, 2019 23:15 IST|Sakshi

(ఆర్‌. దిలీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌, సాక్షి): భారతీయులకు లభించే బ్రిటన్‌ వీసాలు పెరిగి భారత్‌–యూకే వ్యాపార, విద్య, సాంస్కతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంతో సరిగ్గా ఏడాది కింద రెండు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందపు కార్యాచరణ ప్రారంభమైందని భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ డొమినిక్‌ అశ్క్విత్‌ తెలిపారు. మరిన్ని వీసాల లభ్యత, సాంకేతిక క్లస్టర్ల ఏర్పాటు వంటివి ఈ దిశలో ఒక ముందడుగు కాగలవని ఆయన పేర్కొన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో ఇప్పటికే ఇక్కడున్న చొరవ దష్ట్యా, ఈ భాగస్వామ్యాన్ని మరింత ఫలవంతం చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన అశ్క్విత్‌ తనను కలిసిన పాత్రికేయులతో కాసేపు ఇష్టాగోష్ఠి జరిపారు. ఏడాది కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్‌ పర్యటన సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే! సాంకేతిక సహకారం–వాణిజ్య విస్తరణతో ఉభయదేశాల పరస్పర ప్రయోజనం ఇందులో ప్రాధాన్యత అంశమని అశ్క్విత్‌ అన్నారు.

నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యాల్ని భారత్‌లో విస్తరించడానికి ఇప్పటికే బ్రిటన్‌ వ్యాపార–వాణిజ్య సంస్థలు సంసిద్దంగా ఉన్నాయన్నారు. తాము కాల్‌టెక్‌ హబ్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా, ఇక్కడ వినూత్న తరహాలో వచ్చిన అంకుర సంస్థల(స్టార్టప్స్‌)తో భాగస్వామ్యాలకు బ్రిటన్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్‌ మరింత ప్రయోజనకారి కాగలదని అంచనా వేశారు. బ్రిటన్‌ నైపుణ్యాల్ని, సాంకేతిక సహకారాన్ని గరిష్టంగా వినియోగించుకునేలా ఇక్కడి అంకుర సంస్థలతో అనుసంధానించే నైపుణ్య మానవవనరుల్ని సమకూర్చడం ద్వారా తెలంగాణ ‘టీ–హబ్‌’ కీలకపాత్రదారి కానుందన్నారు. చమురు కోసం సముద్ర గర్భాన్ని తొలిచే సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో బ్రిటన్‌ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చమురు–సహజవాయు రంగంలో పనిచేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

విద్య–ఉద్యోగ రంగంలోనూ పెరగనున్న వీసాలు
ఐరోపా సంఘం (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో కొత్త వలసల విధానం రూపుదిద్దుకుంటోందన్నారు. దాంతో, భాగస్వామ్య వృద్ధిలో, విద్య–ఉద్యోగావశాల్లో భారత్‌ వంటి దేశాలకు మున్ముందు చక్కని అవకాశాలుంటాయని హైకమిషనర్‌ అశ్క్విత్‌ అన్నారు. ఐటీ, వైద్య రంగంలో భారత్‌ ధృడంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌ నుంచి యూకేలో ఉన్నత విద్యకు వెళ్లే వారిప్పుడు 37 శాతం పెరిగారన్నారు. గత సంవత్సరం ఈ వద్ధి రేటు 17 శాతమన్నారు. ప్రతి 10 మందిలో 9 మంది విద్యార్థులకు వీసాలు లభించే పరిస్థితి ఉందన్నారు. యూకే విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని భారత విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకోవాలన్నదే తమ కోరికని, పెరుగుతున్న సంఖ్య దానికి నిదర్శనమని పేర్కొన్నారు. వాణిజ్య, విద్యా, ఉద్యోగ వీసాల్లో వృద్ధి వల్ల బ్రిటన్‌ సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, ఇది పరస్పర వాణిజ్య, సాంస్కతిక సంబంధాల్ని మెరుగుపరుస్తుందన్నారు. రానున్న క్రికెట్‌ ప్రపంచ కప్‌ సందర్భంగా కూడా బ్రిటన్‌కు భారతీయ సందర్శకులు పెరుగుతారన్నారు. 2018లో భారత్‌కు చెందిన నైపుణ్యంగల ఉద్యోగులు–సిబ్బందికి 55,000 బ్రిటన్‌ వీసాలు లభించాయని, మిగతా అన్ని దేశాలకు కలిపి దాదాపు ఇన్నే లభించాయని గుర్తు చేశారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ చార్జీలు కంపెనీలు భరించాలి

లండన్‌లో ఘనంగా ‘బోనాల జాతర’ వేడుకలు

ఆశల పాలసీ అమలెప్పుడో..

అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు

అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

అతిథిగా పిలిచి అవమానిస్తామా? : తానా

లండన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

లండన్‌లో ఘనంగా బోనాలు

అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం 

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి

నైపుణ్యం ఉంటేనే మెరుగైన ఉపాధి

ఏటేటా పెరుగుతున్న ప్రవాసుల ఆదాయం

ఎంఎఫ్‌ఏ, డీటీపీ ఆధ్వర్యంలో దుబాయిలో వర్క్‌షాప్‌

ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌ సీపీ విజయోత్సవం

హెచ్‌1 వీసాల మోసం; ఇండో అమెరికన్లు అరెస్టు

తానా మహాసభలకు రాంమాధవ్‌కు ఆహ్వానం

సౌదీలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ తప్పనిసరి

అవగాహన లేకుంటే.. చిక్కులే

భారత సంతతి ప్రియా.. మిస్‌ ఆస్ట్రేలియా

ఎట్టకేలకు ‘ఎడారి’ నుంచి విముక్తి 

సైకియాట్రిస్ట్‌ ఝాన్సీ రాజ్‌ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు