దలిప్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించండి

28 Jun, 2013 17:39 IST|Sakshi
యూఎస్ చట్టసభకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు దలిప్ సింగ్ సౌంద్ భారతీయ సమాజ అభ్యున్నతికి విశేష కృషి చేశారని అదే సభకు ఎన్నికైన ప్రస్తుత ఎన్నారై సభ్యుడు అమీబెరా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా హాల్ ఆఫ్ ఫేమ్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వానికి అమీబెరా విజ్క్షప్తి చేశారు. ఆయన నేతృత్వంలోని 14 మంది చట్టసభ సభ్యుల బృందం కాలిఫోర్నియా గవర్నర్కు శుక్రవారం లేఖ రాసింది.
 
యూఎస్లో భారతీయ సమాజ హక్కుల కోసం పోరాడిన ధీరుడు సౌంద్ అని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆసియా- అమెరికా సమాజానికి ఆయన ఓ దిక్సూచిగా వారు అభివర్ణించారు. ఆయన సేవలను గుర్తించి కాలిపోర్నియా హాల్ ఆఫ్ ఫేమ్లో దలిప్ ప్రతిమను ఏర్పాటు చేయాలన్నారు. యూఎస్లో 85, 86, 87వ చట్టసభలకు జరిగిన ఎన్నికల్లో దలిప్ సభ్యునిగా ఎన్నికైయ్యారని వివరించారు.
 
భారత్లోని ఓ మారుమూల కుగ్రామంలో సౌంద్ జన్మించారు. 1920లో యూఎస్ వలస వచ్చారు. అనంతరం ఆయన యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉన్నత విద్యను అభ్యసించారు. అలాగే 1942న యూఎస్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని అమీబెరా నేతృత్వంలోని అమెరికా చట్టసభ సభ్యులు ఆ లేఖలో పొందుపరిచారు. ఇప్పటి వరకు అమెరికా చట్టసభకు ముగ్గురు భారతీయ అమెరికన్లు ఎన్నికైన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు