చికాగోలో ఘనంగా ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం

23 Oct, 2019 21:11 IST|Sakshi

చికాగో : దసరా వెళ్లి, దీపావళి పర్వదినానికి భారతీయులందరూ ఉత్సాహంగా సిద్ధమవుతున్న వేళ చికాగో ఆంధ్ర సంఘం (సిఏఏ) ఆధ్వర్యంలో ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లెమాంట్ హిందూ దేవాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి  సుమారు 1000 మందికి పైగా పాల్గొన్నారు. శ్రీచైత్య పొనిపిరెడ్డి నేతృత్వంలో యువ చిత్రకారిణి అర్చిత దామరాజు, ప్రవేశ ద్వారం వద్ద అలంకరణలను జయశ్రీ సోమిశెట్టి, అఖిల్ దామరాజు అందించి మొత్తం ప్రాంగణానికి నూతన శోభను చేకూర్చి పలు ప్రశంసలను అందుకున్నారు. సంఘ అధ్యక్షులు పద్మారావు అప్పలనేని నాయకత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కోశాధికారి అనురాధ గంపాల నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. 

గురు జానకి ఆనందవల్లి (రామాయణ శబ్దం), అపర్ణ ప్రశాంత్ (శ్రీరాజరాజేశ్వరి అష్టకం), జ్యోతి వంగర (మహాలక్ష్మి నమోస్తుతే) తమ తమ విద్యార్ధులతో ప్రదర్శించిన సంప్రదాయ కూచిపూడి నృత్యాలు కార్యక్రమాలు హైలైట్ గా నిలిచాయి. అలాగే వాణి దిట్టకవి పర్యవేక్షణలో గురు జ్యోతి వంగర రూపొందించిన సీతారామ కళ్యాణం  ప్రేక్షకులను అలరించింది. స్మిత నండూరి, సుష్మిత బట్టర్, హరిణి మేడ, పూజ జోషి, శ్వేత కొత్తపల్లి, జయశ్రీ సోమిశెట్టి, రాణి తంగుడు, కిరణ్మయి రెడ్డివారి, మృదులత మతుకుమల్లి, ప్రశాంతి తాడేపల్లి, పూర్ణిమ వేముల, శైలజ సప్ప, శిల్ప పైడిమర్రి, దివ్య చిత్రరసు, సమత పెద్దమారు, సౌమ్య బొజ్జా, మాలతి దామరాజు, షాలిని దీక్షిత్, యశోద వేదుల సందర్బోచితంగా సినిమా గీతాలు పాడి అలరించారు. అనంతరం లక్ష్మీనాగ్ సూరిభొట్ల దర్శకత్వంలో ప్రదర్శించిన సందేశాత్మక హాస్యనాటిక మహానటి కడుపుబ్బ నవ్విస్తూనే అందరినీ ఆలోచింపజేసింది.

ఈ కార్యక్రమానికి మైత్రి అద్దంకి, నిఖిల్ దిట్టకవి, మాలతి దామరాజు, మణి తెల్లాప్రగడ వాఖ్యాతలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని హుషారుగా ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమంలో సంఘ సహ వ్యవస్థాపకులు శ్రీనివాస్ పెదమల్లు, మల్లేశ్వరి పెదమల్లు, రాఘవ జాట్ల, శివబాల జాట్ల, సుందర్ దిట్టకవి, వాణి దిట్టకవి, దినకర్ కరుమూరి, పవిత్ర కరుమూరి, ప్రసాద్ నెట్టం, భార్గవి నెట్టెం, ఉమ కటికి, సంధ్య అప్పలనేని, కార్యవర్గ సభ్యులు శిరీష కోలా, శ్రుతి మోత్కూర్, మురళి రెడ్డివారి, గౌరి అద్దంకి, శ్రీ హరి జాస్తి, విజయ్ కొర్రపాటి, విష్ణువర్ధన్ పెద్దమారు, సురేష్ పోనిపిరెడ్డి, సత్య నెక్కంటి, సాయి రవి సూరిభోట్ల, సురేష్ ఐనపూడి, రమేష్ తాంగుడు, సతీష్ దేవేళ్ళ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు