యూఎస్లో మరో రెండు భారతీయ పీఠాలు

30 Jun, 2013 16:16 IST|Sakshi

యూఎస్లోని బ్రౌన్, పేస్ యూనివర్శిటీల్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) సహకారంతో భారతీయ పీఠాలు ఏర్పాటు చేస్తున్నట్లు న్యూయార్క్లోని భారత కౌన్సిల్ జనరల్ ధ్యానేశ్వర్ ములయ్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ఇటీవలే పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా కౌన్సిల్ జనరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఇటీవలే భారతీయ పీఠం ఏర్పాటుపై రట్జర్ యూనివర్శిటీతో అవగాహాన ఒప్పందంపై సంతకాలు జరిగిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే విధంగా యూఎస్లోని మరిన్ని యూనివర్శిటీల్లో భారతీయ విద్యా పీఠాలు ఏర్పాటు చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

యూఎస్లోని వివిధ యూనివర్శిటీల్లో కోర్సుల కోసం దాదాపు లక్ష మంది భారతీయ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. ఆయా కోర్సులో చేరేందుకు ఆయా విద్యార్థులు రూ. 3.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఫీజుగా ల్లించనున్నట్లు ధ్యానేశ్వర్ తెలిపారు. భారత్లో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఏటా తమ చదువులు పూర్తి చేసుకొని సరైన నైపుణ్యం లేక విద్యార్థి దశ నుంచి నిరుద్యోగ దశలోకి అడుగుపెడుతున్నారని ఆయన తెలిపారు.

 

అయితే అమెరికా యూనివర్శిటీలు, భారత్ యూనివర్శిటీల భాగస్వామ్యంతో భారతీయ విద్యార్థుల్లో శిక్షణ, పరిశోధన, బోధన తదితర రంగాల్లో సహాయ సహకారాలు అందించుకోవాలని ఆయన సూచించారు. అందువల్ల నిరుద్యోగం అనే మహమ్మారిని పారద్రోలవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే యూఎస్లోని ప్రతిష్టాత్మకమైన కొలంబియా యూనివర్శిటీలో బీఆర్ అంబేద్కర్ పేరిట ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ కేంద్రం గుర్చి ఆయన వివరించారు. అయితే న్యూయార్క్లోని కౌన్సిల్ జనరల్ కార్యాలయం అందిస్తున్న సేవలను ధ్యానేశ్వర్ ఈ సందర్బంగా వివరించారు.

మరిన్ని వార్తలు