పానీపూరి స్టాల్‌తో విరాళాలు సేకరించిన నాట్స్‌

6 Nov, 2019 10:44 IST|Sakshi

వినూత్న ఆలోచనతో విరాళాల సేకరించిన నాట్స్‌

సెయింట్ లూయిస్ : అమెరికాలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) ఈ సారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాన్సస్‌లోని నాట్స్‌ సభ్యులు ఒక రోజు పానీపూరి స్టాల్‌ను ఏర్పాటుచేసి దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని హిందూ దేవాలయానికి విరాళంగా ఇచ్చారు.  నాట్స్‌ చేపట్టిన ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది.

నాట్స్‌ సభ్యులు పానీపూరి స్టాల్‌ నిర్వహించడం ద్వారా 1500 డాలర్ల మొత్తం సమకూరగా.. వచ్చిన ఆ మొత్తాన్ని స్థానిక హిందూ దేవాలయ నిర్మాణానికి విరాళంగా అందించారు. క్యాన్సస్‌లో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంపై స్థానిక తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు  నాట్స్‌ సంఘం అధ్యక్షుడు  శ్రీనివాస్ మంచికలపూడి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు