సీఏఏ ఆధ్వర్యంలో వనభోజనాలు

25 Jun, 2019 22:26 IST|Sakshi

చికాగో : చికాగో ఆంధ్రా అసోసియేషన్‌(సీఏఏ) ఆధ్వర్యంలో  వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన ఆంధ్ర వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి మేలిసి ఈ వనభోజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బారింగ్టన్ రోడ్ పాండ్ పిక్నిక్ గ్రోవ్‌లో నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమానికి దాదాపు 800 మంది హాజరయ్యారు. ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతామని ప్రెసిడెంట్ పద్మారావు పేర్కొన్నారు. 

ఉదయం నుంచి, సాయంత్రం వరకు జరిగిన ఈ వనభోజనాల్లో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. చికాగోలో తమ పిల్లలతో గడపాలని ఆంధ్ర నుంచి వచ్చిన తల్లిదండ్రులు సీఏఏ వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు. ఆంధ్రాలోనే బఫెట్ పద్ధతికి అలవాటు పడుతున్న రోజుల్లో అగ్ర రాజ్యంలో సీఏఏ వారి కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. సాయిరవి సూరిభోట్ల, విజయ్‌ కొరపాటి, సురేష్‌ పొనిపిరెడ్డి, విష్ణువర్ధన్ పద్దమారు, సత్య తోట పర్యవేక్షణలో విష్ణు విలాస్ వారు అందించిన విందుభోజనానికి తోడుగా సుజాత అప్పలనేని, రాజీ మక్కెన, శైలజ కపిల తయారుచేసిన గోంగూర పచ్చడి, నాటుకోడి కూర, ఆవకాయ పచ్చడి,  మైసూర్‌పాక్‌, నెయ్యితో కలిపి కోనసీమ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అరటి ఆకులలో వడ్డించారు. సాయంత్రం మల్లేశ్వరి పెదమల్లు ఆధ్వర్యంలో మహిళలు ముంత మసాలా తయారుచేసి వడ్డించారు. 

ప్రెసిడెంట్ పద్మారావు అప్పలనేని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ భార్గవి నెట్టెం (ప్రెసిడెంట్ ఎలెక్ట్ 2020) సీఏఏ ఫౌండర్స్ దినకర్ - పవిత్ర కారుమూరి, మల్లేశ్వరి - శ్రీనివాస్‌ పెదమల్లు, సుందర్‌- వాణి దిట్టకవి, రాఘవ జాట్ల, ప్రసాద్‌ - భార్గవి నెట్టెం, సుజాత అప్పలనేని, ఉమా కటికి, సీఏఏ బోర్డ్‌ డైరెక్టర్లు శ్యామ్‌ సుందర్‌ పప్పు, సాయిరవి సూరిభోట్ల, శైలేష్‌ మద్ధి, శ్రీకృష్ణ మతుకుమల్లి, రాజ్‌ పోట్లూరి, రామకృష్ణ తాడేపల్లి, గౌరిశంకర్‌ అద్దంకి, శిరీష కోల, అనురాధ గంపాల, సాహితీ కొత్త, కిరణ్‌ వంకాయలపాటి, సునిత రాచపల్లి, నీలిమా బొడ్డు,  మైత్రి అద్దంకి, నిఖిల్‌ దిట్టకవి తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి వంగర సారథ్యంలో సంఘ వ్యవస్థాపకులు, బోర్డ్ డైరెక్టర్లు చేసిన ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ విశేష ఆకర్షణగా నిలిచి అందరినీ అలరించింది. ఈ సందర్భంగా పిల్లలకి పెద్దలకి ఆటపాటల పోటీలను నిర్వహించి.. నీలిమ బొడ్డు, జయశ్రీ సోమిశెట్టి, శ్రీచైత్య పొనిపిరెడ్డి, శ్వేతా కొత్తపల్లి, సరిత వీరబ్రహ్మ, నాగేశ్వరి తోట, కిరణ్ మట్టే, స్మిత నండూరి బహుమతులందించారు. ఈ వనభోజనాలు జయప్రదం కావడానికి సహకరించిన దాతలు పటేల్ బ్రదర్స్, అశోక్ లక్ష్మణన్, కృష్ణ రంగరాజు తదితరులకు  ప్రెసిడెంట్ పద్మారావు అప్పలనేని మరియు సీఏఏ బోర్డు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్వదేశ్ మీడియావారి  ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సహకారాన్ని పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు