చికాగో ఆంధ్రా సంఘం మహిళా దినోత్సవ వేడుకలు

12 Mar, 2020 15:55 IST|Sakshi

చికాగో: చికాగో ఆంధ్రా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అమెరికాలోని చికాగోలో అత్యంత ఘనంగా జరిగాయి. తమకూ సమాన అవకాశాలు కావాలంటూ చికాగో ఆంధ్రా సంఘం మహిళా సభ్యులు ముక్తకంఠంతో నినదించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం మనోహరంగా సాగింది. ఈ సందర్భంగా చికాగో ఆంధ్ర సంఘం సేవా విభాగమైన ఏపీడీఎఫ్‌ఎన్‌ఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన వివిధ అభివృద్ధి పథకాల కోసం అధిక మొత్తం విరాళాలిచ్చిన శ్రీమతి నాగేశ్వరి చేరుకొండ, శ్రీమతి డా. విజి సుసర్ల, శ్రీమతి సుజాత మారంరెడ్డి లకు ప్రశంసాఫలకాలను అందజేశారు. ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్ “సమానత్వం”పై చికాగో ఆంధ్ర సంఘం ప్రెసిడెంట్ డా.భార్గవి నెట్టెం మాట్లాడుతూ మనలో ప్రతి ఒక్కరూ.. అందరికీ సమాన అవకాశాలు లభించే ప్రపంచాన్ని సృష్టించడానికి కృషి చేయాలని కోరారు.

సంతూర్ తల్లులు కిరణ్ మట్టే, మాలతి దామరాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనురాధ గంపాల రిజిస్ట్రేషన్లు, పార్టీ హాల్ అలంకరణలు మల్లేశ్వరి పెదమల్లు, పవిత్ర కరుమూరి, ఆహ్లాదకరమైన ఆటలను సాహితి కొత్త నిర్వహించారు. చికాగో నేపర్విల్ ప్రాంతంలోని ప్రఖ్యాత దంత వైద్యులు డాక్టర్ సత్య మేడనాగ దంత సంరక్షణ, నోటి ఆరోగ్యం కోసం తీసుకోవలసిన మెళకువలు వివరించారు.

ప్రముఖ డైటీషియన్ దీపాలి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, భారతీయ ఆహారపు విశిష్టతను, దానిని పాశ్చాత్య దేశాల జీవనవిధానానికి తగినట్లుగా ఎలా మలచుకోవటం అనే ఆవశ్యకతను, సూచనలను తెలియజేసి అందరి మెప్పును పొందుతూ ఆసక్తికరంగా వివరించారు. మెహెందీ ఆర్టిస్ట్ నౌషీన్ మహిళలందరికీ వేసిన గోరింటాకు చిత్రాలు మైమరపించాయి.

ఇల్లినాయిస్ 11 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న శ్రీ కృష్ణ బన్సాల్ గౌరవ అతిథిగా వచ్చి ‘సమానత్వం’ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికీ గుర్తు చేశారు. శారీ డ్రేపింగ్ పోటీల్లో పాల్గొన్న అందమైన భామలు చీరలను స్టైలిష్ గా ధరించడంలో వారి ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పోటీ ఆద్యంతం అందరికీ కన్నుల పండుగగా జరిగింది. ఇన్‌స్టంట్‌ పాట్ వంటల పోటీతో మహిళలు ఆనందించారు

ఈ తరం తల్లుల గురించి హరినణి మేడా చేసిన ఫన్నీ స్కిట్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. మాధురి తీగవరపు, అనుపమ తిప్పరాజు, సునీతా విస్సా ప్రగడ, లావణ్య ఆరుకొండ వారి పాటలతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు.

అబ్సొల్యూట్ బిబిక్యు వారు తయారుచేసిన రుచికరమైన బఫేలో అమ్మాయిలు స్ట్రాబెర్రీ కస్టర్డ్‌ను ఎక్కువగా ఆనందించారు. చికాగో ఆంధ్రా అసోసియేషన్ వారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి హాజరైన మహిళలందరికీ ఇది ఒక ఆహ్లాదకరమైన జ్ఞాపకంగా మిగిలింది.

మరిన్ని వార్తలు