చికాగోలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

25 Jul, 2018 22:28 IST|Sakshi

చికాగో: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని చికాగో తెలుగు కమ్యూనిటీ ఘనంగా నిర్వహించింది. స్థానిక థుమ్కా బాంకెట్‌ హోటల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు  భారీ ఎత్తున వైఎస్సార్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ పేదప్రజలకు, విదేశాల్లో ఉన్న తెలుగువారికి అందించిన సేవలను కొనియాడారు. అదేవిధంగా తండ్రి బాటలో  ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా ప్రజాపక్షనేతగా ఎదిగినతీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి పద్మజా రెడ్డి, చికాగో పార్టీ ఇంచార్జ్‌ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . కార్యక్రమంలో రమణా అబ్బరాజు, మనోజ్‌ సింగమశెట్టి, రాంభూపాల్‌ రెడ్డి కందుల, కేకే రెడ్డి, వెంకట్‌ రెడ్డి లింగారెడ్డిగారి, జయదేవ్‌ మెట్టుపల్లి, క్రిష్ణా రంగరాజు, శ్రీని వోరుగంటి, రమాకాంత్‌ రెడ్డి, హరిందర్‌ రెడ్డి, జగదీశ్‌, శివ, రవి కిషోర్‌ ఆల్లా, సేతుకుమార్‌ కర్రి, ప్రమోద్‌ ముత్యాల, రామిరెడ్డి పెద్దిరెడ్డి, వెంకట్‌ పులుసు, గోపీ పిట్టల, మోహన్‌, రాజ్‌ అడ్డగట్ల, సురేష్‌ శంక, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు