బహ్రెయిన్‌లో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

17 Feb, 2020 21:09 IST|Sakshi

బహ్రెయిన్‌: బహ్రెయిన్‌లోని ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్ అధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) 66వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఆయన పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేసి.. పబ్లిక్‌ గార్డెన్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి కోట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారని గుర్తుచేశారు. తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరున్నర సంవత్సరాలు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికై అహార్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన  ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను మన వంతు పాత్ర పోషించి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.  

ప్రభుత్వ వ్యతిరేకులకు పథకాలతోనే సరైన సమాధానం ఇవ్వాలని, గల్ఫ్ దేశాలలో ఉన్న కూడా సీఎం కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం అనందంగా ఉందన్నారు. తమ కుటుంబాలను వదిలి ఉపాధికోసం గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు త్వరలో సీఎం కేసీఆర్‌  గల్ఫ్‌లో పర్యటించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలతో చర్చించి తదితర వివరాలు కనుకుని, గల్ఫ్‌లో భారత రాయబారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కారించనున్నట్లు తెలిపారు.  కాగా ఇప్పటి వరకు ఏ రాష్ట్ర సీఎంలు కూడా గల్ఫ్‌లో పర్యటించిన దాఖలు లేవన్నారు. దీంతో ఎన్నారైల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని సతీష్  కుమార్ అభిప్రాయపడ్డారు.

జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల మాట్లాడుతూ.. కేసీఆర్‌ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం తాము ఒక అదృష్టంగా భావిస్తుమన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ విజయాన్ని అందించిన  తెలంగాణ ప్రజలకు  ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన ప్రతి టీఆర్‌ఎస్‌ నాయకులకు అభినందనలు తెలియజేశారు. అలాగే ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిరెన్‌లకు సలహాలు సూచనలు అందిస్తు సెల్‌ను ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ, ఎన్నారై టీఆర్‌ఎప్‌ సలహాదారు కల్వకుంట్ల కవితకి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి, టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు పార్టీ నాయకులందరికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈకార్యక్రమంలో  పాల్గొని విజయవంత చేసిన అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, సెక్రెటరీలు  చెన్నమనేని రాజేందర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు