ఫార్మింగ్టన్‌ ఫేక్ యూనివర్సిటీ కేసులో విద్యార్థులకు ఊరట

13 Feb, 2019 15:06 IST|Sakshi

ఫార్మింగ్టన్‌ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్టైన 16 మంది విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. స్వచ్ఛందంగా స్వదేశాలకు ఫిబ్రవరి 20లోగా వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 20 మందిలో ముందుగానే ముగ్గురు విద్యార్థులు(ఇద్దరు ఇండియన్స్, ఒక పాలస్తీనియన్) వాలంటరీ డిపార్చర్ అనుమతి పొందారు. మిగిలిన 17 మందిపై మంగళవారం విచారణ జరిగింది. 17 మందిలో 15 మందికి అందులో 8 మంది తెలుగు విద్యార్థులకు వాలంటరీగా స్వదేశాలకు తిరిగి వెళ్లే అవకాశాన్ని కోర్టు కల్పించింది. 16వ అమ్మాయికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం కల్పించింది. కానీ, స్వచ్చందంగా(వాలంటరీగా) కాకుండా యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ క్రింద పంపుతున్నట్లు తెలిపింది. ఫార్మింగ్టన్‌ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్ట్ అయిన విద్యార్థుల ఫైనల్ హియరింగ్ ఫిబ్రవరి 12న జరిగింది. కేలహోన్ కౌంటీ జైలులో 12 మంది, మన్రో కౌంటీ జైలులో 8 మంది ఉన్నారు.

17వ విద్యార్థి యూఎస్ సిటిజన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అందుకు అతను కేసు వాదించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 15 మంది విద్యార్థులు కోర్టు జడ్జిమెంట్ మేరకు వాలంటరీగా ఫిబ్రవరీ 20 లోగా యూఎస్ వదిలివెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా తిరుగు ప్రయాణానికి సిద్దమవుతున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇండియన్ ఎంబసీ అధికారులను తెలంగాణ అమెరికన్ అసోసియేషన్(ఆటా-తెలంగాణ) కోరింది. తెలంగాణ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు విద్యార్థులను స్వదేశానికి పంపే ఏర్పాట్లను ఇండియన్ ఎంబసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు