ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి

4 Jul, 2019 21:37 IST|Sakshi

కాన్‌ టౌన్‌షిప్‌ (పెన్సిల్వేనియా) : ప్రముఖ సైక్లిస్టు శ్రీరామమూర్తి కయ్యలముడి (48) కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. జూన్‌ 29న జరిగిన ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక పోలీసులు వాషింగ్టన్‌లోని పావోలి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడుకు, వెన్నముకు, ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలయ్యాయని.. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్లు తెలిపారు. తెలుగు వాడైన శ్రీరామమూర్తి పలు స్వచ్ఛంద కార్యక‍్రమాలు చేపట్టి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.  స్వతహాగా సేవా దృక్పథం కలిగిన వ్యక్తం కావడంతో.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనేవారు. అరోగ్యకరమైన జీవితం కోసం అందరూ జాగింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌ చేయాలని అందరినీ ప్రోత్సహిస్తుండేవారని సన్నిహితులు చెబుతున్నారు. శ్రీరామమూర్తి స్వయంగా పాల్గొని ఎన్నో ప్రతిష్టాత్మకమైన మారథాన్‌లు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే అందరికీ ఆదర్శంగా ఉండే శ్రీరామమూర్తి ఇలా ప్రమాదానికి గురికావడంతో.. ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి  వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఇటువంటి ఉన్నతమైన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వైద్య చికిత్స కోసం ఎన్నారై సంస్థలు ఫండ్‌ రైజింగ్‌ చేపట్టారు. ఫండ్‌ రైజింగ్‌ కోసం.... 

https://www.gofundme.com/f/help-murthy-to-run-again

మరిన్ని వార్తలు