టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు

29 Nov, 2019 14:50 IST|Sakshi

డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్‌) నిర్వహించిన దీపావళి వేడుకలు నవంబర్‌ 9వ తేదీన డల్లాస్‌లోని ఫ్రిస్కో ఫ్లైయర్స్‌ ఈవెంట్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా, కనుల పెండుగగా జరిగాయి. టాంటెక్స్‌ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఈవెంట్ కోఆర్డినేటర్‌ వెంకట్ బొమ్మ, వారి కార్యవర్గ బృందంతో కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రాంగణమంతా అందమైన అలంకరణతో ముస్తాబై, అతిథులకు, ప్రేక్షకులకు ఆహ్వానం పలికింది. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. యాంకర్‌ సంధ్య మద్దూరి ఆధ్వర్యంలో స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతదేశం నుంచి వచ్చిన లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి, వారి బృందం యాంకర్‌ సాహితి, గాయకులు సుమంగళి, శ్రీకాంత్‌, సింహాత్రి, సౌజన్య, ప్రవీణ్‌, ఇమిటేషన్‌ రాజు తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనంతరం కోటి అందించిన 1980, 1990లో బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచిన చిరంజీవి మూవీ హిట్స్‌ పాటలతతో అందరి హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. 

అనంతరం టాంటెక్స్‌​ అధ్యక్షులు చిన్న సత్యం మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన దీపావళి పోషక దాతలకు ధన్యవాదాలు తెలిపి, సత్కరించారు. టాంటెక్స్‌ ఎల్లప్పుడూ వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి చివరి వరకు జరిగేలా సహాయం, సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథి లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి, వారి బృందానికి టాంటెక్స్‌ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్దరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు,ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మీ, కార్యదర్శి ఉమా మహేష్‌ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్‌ రెడ్డి తోపుడుర్తి, సతీష్‌ బండారు, వెంకట్‌ బొమ్మ, శరత్‌ యర్రం, కళ్యాణి తాడిమేటి, పాలక మండలి అధ్యక్షుడు ఎన్‌ ఎమ్‌ రెడ్డి, పవన​ నెల్లుట్ల, ఇందురెడ్డి, మందాడి.. శాలువ కప్పి సతక్కరించారు.

కాగా టాంటెక్స్‌ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు కోటి ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈవెంట్‌ను విజయవంతం చేసిన అందరికీ, ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్‌ కార్యవర్గ సభ్యులకు అలాగే వివిధ కమిటీ సభ్యులకు,స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చివరిగా జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లదపరిచిన దీపావళి వేడుకలు ముగిశాయి. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు