డల్లాస్‌ మహానాడుకు నిరసన సెగ

28 May, 2018 10:12 IST|Sakshi

డల్లాస్‌ : అమెరికాలో తొలిసారిగా డల్లాస్‌లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది. అమెరికా నలుమూలల నుండి వంద మందికి పైగా తెలుగు ఎన్‌ఆర్‌ఐలు డల్లాస్ లో జరుగుతున్న మహానాడు వద్దకి నిరసన తెలపడానికి వచ్చారు. మహానాడు ఎందుకు ఇక్కడ పెట్టామో అని  పేరు చెప్పడానికి ఇష్టపడని ఇండియా నుండి వచ్చిన టీడీపీ నాయకులు వాపోయారు. ఇక్కడ  టీడీపీ మీద ఇంత వ్యతిరేకత ఉందా అని ఊహించలేకపోయామన్నారు. తెలుగు ఎన్‌ఆర్‌ఐ ప్రత్యేక హోదా పోరాట సమితి ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐలు నల్లటి దుస్తులు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. తెలుగు దేశం ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారు. ప్లకార్డులు, బ్యానర్‌లతో నిరసన వ్యక్తం చేశారు. కుల, మత, రాజకీయ, ప్రాంత భేధాలు లేకుండా అందరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇదంతా గమనించిన ఇండియా నుండి వచ్చిన నాయకులు డల్లాస్ మహానాడు నిర్వాహకులని మందలించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు