29 నుంచి దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌

25 Oct, 2019 12:04 IST|Sakshi

పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు

మోర్తాడ్‌: పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రభుత్వం24వ దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. ఈనెల 29న దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించనుంది. గ్లోబల్‌ విలేజ్‌ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పర్యాటకులను ఆకర్షించడానికి 3,500 షాపింగ్‌ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రతి ఏటా దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌ను అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎన్నో దేశాల పర్యాటకులు ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌లో పాల్గొని తమకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తుంటారు.

అనేక రకాల సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తారు. షాపింగ్‌ ఔట్‌లెట్స్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన వివిధ రకాల ఆహార పదార్థాలను వండిపెట్టడానికి రెస్టారెంట్లు కూడా ఏర్పాటయ్యాయి. ఊష్ణోగ్రతలు తగ్గిన తరువాత అంటే.. శీతాకాలం ఆరంభమయ్యేసమయంలో దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. వివిధ దేశాల సంస్కృతి, కళలకు అద్దం పట్టేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. దాదాపు80 దేశాల పర్యాటకులు ఈ దుబాయి షాపింగ్‌ఫెస్టివల్‌లో పాల్గొంటారని అంచనా. తెలంగాణజిల్లాలకు చెందిన ఎంతో మంది యూఏఈలోఉపాధి పొందుతున్నారు. ఆ దేశంలో నివాసముంటున్నమన ప్రాంత కార్మికులు సెలవు దినాల్లోఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గల్ఫ్‌ నుంచి వచ్చి.. కులవృత్తిలో రాణించి..

హిందూ టెంపుల్ ఆఫ్ తల్లహాసీ ఘనంగా దీపావళి వేడుకలు

పొర్ట్‌లాండ్‌ బతుకమ్మ, దసరా వేడుకలు

చికాగోలో ఘనంగా ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం

డాలస్ లో ఘనంగా గాంధీజీ 15౦ వ జయంతి ఉత్సవాలు

సింగపూర్‌లో ఘనంగా శ్రీనివాస కల్యాణం

ఎంటీఎఫ్‌ ఆధ్వర్యంలో వయో వృద్దులకు దీపావళి కానుకలు

మలేషియాలో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

షార్జాలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

అక్కడి నుంచి ఎలా వచ్చేది..!

అమెరికాలో ఘనంగా ‘సంగీత గాన విభావరి’

ఇల్లినాయిస్‌ ఇమ్మిగ్రేషన్ 'వాక్‌ ఫర్‌ ఈక్వాలిటీ'

తెలుగు మహిళల కోసం ‘వేటా ’ ఏర్పాటు

శాక్రమెంటోలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

గేట్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు

ఆటా ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు 

ప్రాజెక్టులతో ఏపీకి రండి సహకారమందిస్తాం

కేసీఆర్‌ త్వరలో గల్ఫ్‌ దేశాల పర్యటన

వలస కార్మిక కుటుంబాల ఉద్యమ బాట

అక్రమ నివాసులకు వరం

సౌదీ కంపెనీపై ఐక్య పోరాటం

డాలస్‌లో వైభవంగా ద్రౌపది నాటక ప్రదర్శన

కాన్సాస్‌లో ఘనంగా దసరా సంబరాలు

అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి

శోభాయమానంగా డాలస్‌ బతుకమ్మ వేడుకలు

ఆటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారం

అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

అట్లాంటాలో వెల్లువెత్తిన బతుకమ్మ సంబరాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..

కృష్ణగిరిలో హీరో ఫ్యాన్స్‌ బీభత్సం

నాన్నా.. సాధించాం : హీరో భావోద్వేగ ట్వీట్‌

గాయని, నటికి తీవ్ర అనారోగ్యం

సమస్యలను అధిగమించి తెరపైకి బిగిల్‌

నాలోని నన్ను వెతుక్కుంటా!