నూకల మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు

19 Jul, 2013 16:38 IST|Sakshi

పద్మభూషణ్, సంగీత కళానిధి, మహామహోపాధ్యాయ శ్రీ నూకల చిన సత్యనారాయణ మృతి పట్ల తెలుగు అసోసియేషన్ ఆఫ్ దక్షిణ కాలిఫోర్నియా (టీఏఎస్సీ)తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని పేర్కొంది. అలాగే నూకల చిన సత్యనారాయణకు దక్షిణ కాలిఫోర్నియాతో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ ప్రస్తావించింది.

 

చిన సత్యనారాయణకు టీఏఎస్సీ పూర్వాద్యక్షులు శ్రీరాజా అయసోల స్వయాన బావగారని గుర్తు చేసింది. నూకల చిన సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా టీఏఎస్సీ సానుభూతిని తెలియజేసింది. సంగీత కళానిధి నూకల చిన సత్యనారాయణ గత గురువారం హైదాబాద్లో మరణించారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొద్ది నెలలుగా ఆయన హృదయ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు.

మరిన్ని వార్తలు