నేడు మస్కట్‌లో ‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ ఆవిష్కరణ

4 Oct, 2019 09:19 IST|Sakshi

గల్ఫ్‌ డెస్క్‌: గల్ఫ్‌ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం జిల్లా పేజీల్లో ‘గల్ఫ్‌ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 2017 నవంబర్‌ 11న ప్రారంభమై ఇప్పటి వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్‌ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 2018 జూన్‌ 15 నుంచి గల్ఫ్‌ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్‌ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాలవివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలు, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమాన్‌ రాజధానిమస్కట్‌లో నేడు (అక్టోబర్‌ 4) నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు ప్రచురిచిత మైన పేజీలను అన్నింటినీ కలిపి‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ ఆవిష్కరించబడనుంది.

మరిన్ని వార్తలు