గల్ఫ్ ప్రవాసీలకు కరోనా హెల్ప్ లైన్లు

1 Apr, 2020 12:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయుల కోసం, కరోనా సంబంధిత సందేహాల నివృత్తికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెం: 1800 11 8797, టెలిఫోన్ నెంబర్లు: +91 11 2301 2113 / 4104 / 7905 ఈ-మెయిల్: covid19@mea.gov.in లోసంప్రదించవచ్చు. నిర్దిష్ట, ప్రత్యేక సహాయం కోసం విదేశాంగ శాఖ సంయుక్త  కార్యదర్శి (గల్ఫ్ వ్యవహారాలు) డా. టి.వి. నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృందం పనిచేస్తుంది. వారి టెలిఫోన్ నెంబర్:  +91 11 4901 8480, మొబైల్ నెంబర్: +91 92050 66104 కు కాల్ చేయవచ్చు. 

గల్ఫ్ దేశాలలో 85 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారు 13 లక్షల చొప్పున గల్ఫ్ లో ఉన్నట్లు ఒక అంచనా.  సౌదీ అరేబియాలోని  భారత రాయబార కార్యాలయం వారి హెల్ప్ లైన్ నెంబర్  +966 54610 3992 ఈ-మెయిల్: covid19indianembassy@gmail.com లేదా సౌదీ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నెంబర్ 937 కు సంప్రదించవచ్చు. దుబాయిలోని భారత రాయబార కార్యాలయం నెంబర్లు +9714 3971 222 / 333, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయం నెంబర్ +971 2 4492700, యూఏఈ ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్లు: +9712 4965228, +97192083344 కు సంప్రదించవచ్చు. 

పుకార్లు నమ్మవద్దు :
కరోనా సందర్బంగా గల్ఫ్ లో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితిలో దుబాయి నుండి హైదరాబాద్ కు ప్రత్యేక విమానాలు  నడుపుతామని కొందరు స్వార్థపరులు కార్మికుల నుండి టికెట్లకు  డబ్బులు వసూలుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతనే నేరుగా ఎయిర్ లైన్ సంస్థల నుండే టికెట్లు కొనుగోలు చేయాలని, అప్పటివరకు ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ఆయన కోరారు. 

గల్ఫ్ ప్రవాసి ప్యాకేజీ ఇవ్వాలి :
"కరోనా కల్లోలంతో గల్ఫ్ దేశాల ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆర్ధిక మాంద్యం వల్ల భవిష్యత్తులో లక్షలాది మంది గల్ఫ్ నుండి స్వరాష్ట్రం తెలంగాణాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రవాసుల పునరావాసం, పునరేకీకరణ కొరకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా 'గల్ఫ్ ప్రవాసి ప్యాకేజీ' కి రూపకల్పన చేయాలి" అని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ల రవిగౌడు కోరారు.

మరిన్ని వార్తలు