సౌదీలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

1 Jul, 2019 12:36 IST|Sakshi

హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ముషీరాబాద్‌లోని బాకారానికి చెందిన వ్యాపారి జహినుల్లా అబిదిన్‌ దంపతులు గత 40 ఏళ్లుగా సౌదీలోని జెడ్డా ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఓ కుమార్తె. కాగా వీరిలో ఇద్దరు కుమారులు రష్యాలోనూ, మరో కుమారుడు బాకారంలోనూ నివసిస్తున్నారు. మిగిలిన సంతానం వీరివద్దే ఉంటోంది.

ఈ నెల 27న జహినుల్లా అబిదిన్‌ తన భార్యా పిల్లలతో కలసి జెడ్డా నుంచి సౌదీకి కారులో వస్తుండగా వీరి వాహనానికి ఒంటె అడ్డుగా రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అబిదిన్‌ దంపతులిద్దరితో పాటు కుమారుడు ముర్తాజా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో కుమారుడు ఇస్మాయిల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇస్మాయిల్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న బాకారంలోని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ముగ్గురి మృతదేహాలను మరో రెండ్రోజుల్లో నగరానికి చేరుకునేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆదుకునేవారేరీ..

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం

‘చికాగో సాహితీ మిత్రులు’ ఆధ్వర్యంలో ‘సాహిత్య సభ’

టెంపాలో నాట్స్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్

అట్లాంటాలో 'తామా' ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ చార్జీలు కంపెనీలు భరించాలి

లండన్‌లో ఘనంగా ‘బోనాల జాతర’ వేడుకలు

ఆశల పాలసీ అమలెప్పుడో..

అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు

అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

అతిథిగా పిలిచి అవమానిస్తామా? : తానా

లండన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

లండన్‌లో ఘనంగా బోనాలు

అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం 

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి

నైపుణ్యం ఉంటేనే మెరుగైన ఉపాధి

ఏటేటా పెరుగుతున్న ప్రవాసుల ఆదాయం

ఎంఎఫ్‌ఏ, డీటీపీ ఆధ్వర్యంలో దుబాయిలో వర్క్‌షాప్‌

ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌ సీపీ విజయోత్సవం

హెచ్‌1 వీసాల మోసం; ఇండో అమెరికన్లు అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం