టెక్సాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

16 Aug, 2019 22:32 IST|Sakshi

టెక్సాస్‌ : భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డల్లాస్‌లోని గాంధీ మెమోరియల్‌ ప్లాజాలో ఘనంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో జెండా పండుగలో పాల్గొన్నారు. మ్యూజిక్‌ టీచర్‌ స్వాతీ జాతీయ గీతాలాపన అనంతరం.. ఎంజీఎంఎన్‌టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇర్వింగ్‌ నగర మేయర్‌ ప్రోటెం ఆస్కార్‌ వార్డ్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా.. గోపాల్‌ పోనంగి, ఫ్రిస్కో ఐఎస్‌డీ బోర్డ్‌ ట్రస్టీ.. మనీష్‌ సేథి, కోపెల్‌ ఐఎస్‌డీ బోర్డు ట్రస్టీ.. వాస్త రామనాథన్‌, అలెన్‌ ఐఎస్‌డీ బోర్డు ట్రస్టీ రాజ్‌ మీనన్‌, కోలిన్‌ కమ్యూనిటీ కాలేజ్‌ డిస్ట్రిక్ట్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ టై బ్లెడ్‌సో, స్థానిక అధికారులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఎంజీఎంఎన్‌టీ కార్యదర్శి రావు కాల్వ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ మెమోరియల్‌ప్లాజా నిర్మించేందుకు సహకరించిన ఇర్విన్‌ నగర అధికార యంత్రంగానికి కృతజ్ఞతలు తెలిపారు. 70 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్‌ సమస్యపై భారత ప్రభుత్వ నిర్ణయం చాలా సంతోషం కలిగించిందని ప్రసాద్‌ తోటకూర అన్నారు. ప్రోగ్రామ్‌ను ప్రసారం చేసిన టీవీ చానెళ్లకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు